Dandruff: చలికాలంలో చుండ్రు సమస్య వేధిస్తోందా? ఆపిల్ సైడర్ వెనిగర్‌తో వారానికి 2 సార్లు ఇలా చేశారంటే..

|

Nov 03, 2022 | 6:12 PM

శీతాకాలం దాదాపు మొదలైనట్లే. ఈ సీజన్‌లో సాధారణంగా ప్రతిఒక్కరినీ చుండ్రు సమస్య వేధిస్తుంది. చుండ్రును తేలికగా వదిలించుకోవాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. చుండ్రుతోపాటు అనేక జుట్టు సమస్యలకు కూడా ఇది మేలు చేస్తుంది..

1 / 5
శీతాకాలం దాదాపు మొదలైనట్లే. ఈ సీజన్‌లో సాధారణంగా ప్రతిఒక్కరినీ చుండ్రు సమస్య వేధిస్తుంది. చుండ్రును తేలికగా వదిలించుకోవాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. చుండ్రుతోపాటు అనేక జుట్టు సమస్యలకు కూడా ఇది మేలు చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా ఉపయోగించాలంటే..

2 / 5
ఒక కప్పు నీటిలో కొన్ని చుక్కలు ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి. జుట్టుకు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో తలకు మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకుంటే సరి.

3 / 5
ఆపిల్ సైడర్ వెనిగర్, వెల్లుల్లి ప్యాక్‌. ముందుగా వెల్లుల్లిని మెత్తగా గ్రైడ్‌ చేసుకుని రసాన్ని వేరు చెయ్యాలి. తర్వాత వెల్లుల్లి రసంలో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి. దీన్ని తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తల స్నానం చెయ్యాలి. ఈ విధంగా వారానికి 1 నుంచి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4 / 5
యాపిల్ సైడర్ వెనిగర్-పెరుగు ప్యాక్‌. అరకప్పు పెరుగులో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత షాంపుతో తల స్నానం చేసుకోవాలి.

5 / 5
ఆపిల్ సైడర్ వెనిగర్-ఆముదం (కస్టర్ ఆయిల్). కప్పు నీళ్లలో కొన్ని ఆపిల్ సైడర్ వెనిగర్ చుక్కలు కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి 2-3 టీ స్పూన్ల ఆముదం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తలకు పట్టించి, మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత తల స్నానం చేసుకోవాలి.