
అధికంగా వేయించిన - కారంగా ఉండే పదార్థాలు: చలిగా ఉందని వేడివేడిగా బజ్జీలు, సమోసాలు లేదా స్పైసీ ఫుడ్ తింటే రక్తపోటుపెరగడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు అస్తవ్యస్తమవుతాయి.

అతిగా ఉప్పు - తీపి: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి గుండెకు ముప్పు వాటిల్లుతుంది. అలాగే అతిగా తీపి పదార్థాలు గుండె పనితీరును మందగింపజేస్తాయి.

ఎర్ర మాంసం: చలికాలంలో మన శరీర జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో రెడ్ మీట్ వంటి భారమైన ఆహారం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం పడి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.

ఏం తినాలి..? : రోజూ నారింజ, ఆపిల్ వంటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు అందుతాయి. ఓట్స్, గంజి, తృణధాన్యాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చేపలు, పప్పుధాన్యాలు, బాదం, వాల్‌నట్స్ వంటి గింజలను డైట్‌లో చేర్చుకోవాలి. అవిసె గింజలు గుండె రక్తనాళాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.

కేవలం ఆహారమే కాదు.. శరీరానికి తగినంత నీరు అందించడం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల తేలికపాటి వ్యాయామం చేయడం చాలా అవసరం. తగినంత నిద్ర పోవడంతో పాటు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల చలికాలంలో వచ్చే గుండెపోటు ముప్పును సమర్థవంతంగా నివారించవచ్చు.