
బెల్లం అన్నం - బెల్లం అన్నం ఒక రుచికరమైన వంటకం. బియ్యం, బెల్లం, లవంగాలు, యాలకులు వేసి ఈ రెసిపీని తయారు చేస్తారు. మీరు ఈ వంటకాన్ని వేడి పాలతో కూడా తయారు చేసుకోవచ్చు.

బెల్లం హల్వా - చాలా మంది బెల్లం హల్వా తినడానికి ఇష్టపడతారు. చలికాలంలో వేడివేడి బెల్లం హల్వా తింటే ఉండే మజానే వేరు.

బెల్లం, వేరుశెనగలు - చలికాలంలో బెల్లం, వేరుశెనగలు కలిపి తినడం మీ ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే ఈ సీజన్‌లో బెల్లం, వేరుశనగలు తినాలని సూచిస్తున్నారు.

బెల్లం చపాతీ - బెల్లం చపాతీని కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇది గోధుమ పిండి, నెయ్యి, పాలు, బెల్లం వేసి తయారు చేస్తారు.