ఏరోస్పేస్ ఇంజనీర్లు, ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్టు ఏజెన్సీలు, పౌర విమానయాన అధికారులు, ఎయిర్ హోస్టర్స్ పాల్గొన్నారు. 5000 మందికి పైగా వ్యాపార వేత్తలు పాల్గొంటారని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. అలాగే చాలా మంది ఈ విమానాలను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో బేగంపేట విమానాశ్రయం మొత్తం కొత్త కళను సంతరించుకుంది.