
భారతదేశంలో కూరగాయలు అన్ని కాలాల్లో చౌకగానే దొరుకుతాయి ధరలు ఎక్కువగా ఉంటే కిలో ముప్పై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుంది. అయితే, అమెరికాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ రేట్స్ మీరు వింటే ఖంగుతినడం పక్కా. మరి, అక్కడ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

ఇక్కడ బెండకాయలు ధరలు మహా అయితే రూ.40 కంటే ఎక్కువ ఉండదు కానీ, అక్కడ మాత్రం కేజీ బెండకాయల ధర రూ.7,200 పలుకుతోంది. యూఎస్‌లో ఉన్న ఈ రేట్లు చూసి భారతీయులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇటీవలే సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అసలు అక్కడ ఈ రేట్లు ఎలా ఉన్నాయంటే?

అమెరికాలో నివాసం ఉంటున్న ఓ ఇండియన్ అక్కడ సూపర్ మార్కెట్‌కు వెళ్ళి బెండకాయల ధర అడగగా .. ధర 6.42 డాలర్లుగా ఉంది. మళ్ళీ ఇది 85 గ్రాములు మాత్రమే ఉంది అది కూడా చిన్న ప్యాకెట్. మన ఇండియన్ కరెన్సీలో కేజీ బెండకాయల ధర రూ 7,200 రూపాయలు. ఇక్కడ రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదు.

ఇక్కడి నుంచి వెళ్లిన భారతీయులు అమెరికాలో తినే కూరగాయలు ఖరీదైన వస్తువుల్లా మారాయి. అయితే ఇక్కడ మాత్రం రూ.50- రూ.70 ఉండే బెండకాయలు అక్కడ కిలో రూ.7,200 పలుకుతున్నాయి. ఇంకా క్యాలీఫ్లవర్ అయితే ఒక్కటి రూ.400 ఉంది అలాగే పాలకూర కట్ట కూడా రూ 10 ఉన్నది అక్కడ రూ.180 వరకు ఉంది

అక్కడి మండుతున్న కూరగాయ ధరలు భారతీయులకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ రెండు మూడు వందల్లో 10 రకాల కూరగాయలు వస్తాయి, కానీ అక్కడ 500 పెట్టినా ఒక్క కూరగాయ కూడా వచ్చేలా కనిపించడం లేదు ఎందుకంటే అక్కడ అన్ని కూరగాయలు దొరకవు. అందువలన ఉన్న కూరగాయలు ఈ రేంజ్ లో ధరలు పలుకుతున్నాయి.