
హై బీపీ సమస్య ఉన్నవారికి బాదం పడదు. బాదం పప్పులో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నిషియం బీపీ లెవల్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతూ..మందులు వాడుతున్న వారు బాదం పప్పు జోలికి పోకూడదంటున్నారు నిపుణులు.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు బాదం పప్పు ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే బాదం పప్పులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఆక్సలేట్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో లేదంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Almonds

బాదం పప్పులో కేలరీలు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా బర్న్ కావు. దీంతో.. వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదముంది. అందుకే అధిక బరువు లేదా ఊబకాయ సమస్యతో బాధపడేవారు బాదం పప్పులు తినకూడదని అంటున్నారు.

మైగ్రేన్ సమస్య ఉన్నవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వారు బాదం పప్పుల్ని తినకూడదంటున్నారు నిపుణులు. అలాగే, చర్మంపై దురద, ఎర్రటి మచ్చలు, శ్వాస కోస సమస్యలతో బాధపడేవారు బాదం పప్పు ఎక్కువగా తినకూడదు. బాదం పప్పు తినడం వల్ల ఈ సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు అంటున్నారు.