ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

Updated on: Mar 29, 2026 | 2:48 PM

సెగలు గక్కుతున్న ఎండలతో బాడీ హీట్ పెరిగిపోతుందా? అయితే మీ వంటింట్లో చిన్న మార్పు చేయాల్సిన సమయం వచ్చేసింది. మనం రోజూ తినే గోధుమ రొట్టె కంటే, వేసవిలో అమృతంలా పనిచేసే కొన్ని ప్రత్యేక రొట్టెలు ఉన్నాయని మీకు తెలుసా? ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఇచ్చిన అద్భుతమైన సలహాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పెరుగుతున్న వేడి దృష్ట్యా, ప్రజలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎలాంటి రొట్టెలు, ఆహారం తీసుకోవాలో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

2 / 5
ఏ సీజన్‌లో ఏ రొట్టె తినాలి: సాధారణంగా అందరూ ఏడాది పొడవునా గోధుమ రొట్టెనే తింటారు. కానీ వాతావరణాన్ని బట్టి ధాన్యాలను మార్చడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని పంకజ్ భదౌరియా సూచించారు. వేసవిలో బార్లీ రొట్టె అమృతంతో సమానం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగే వారికి, త్వరగా అలసిపోయేవారికి ఇది ఉత్తమ ఎంపిక.

3 / 5
రాగిరొట్టెలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇక జొన్న రొట్టె ఏడాది పొడవునా తినవచ్చు. ఇందులో ఉండే పీచు పదార్థం కడుపును తేలికగా ఉంచుతుంది. అయితే చలికాలంలో మేలు చేసే మొక్కజొన్న, సజ్జ రొట్టెలకు వేసవిలో దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి.

4 / 5
వేసవిలో కేవలం నీళ్లు తాగడం మాత్రమే సరిపోదు. ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. పుచ్చకాయ, కర్బూజా, నారింజ, ద్రాక్ష, మామిడి పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లను, తేమను అందిస్తాయి. దోసకాయ, సొరకాయ, పాలకూర వంటివి సులభంగా జీర్ణమై శరీర వేడిని తగ్గిస్తాయి.

5 / 5
కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు కలుపుకుని తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. నిమ్మరసం వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది. వేసవిలో మసాలాలు, నూనె పదార్థాలు, బరువైన ఆహారానికి దూరంగా ఉండాలి. వీలైనంత వరకు కిచిడీ, సలాడ్స్ వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.

Follow Us