
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆర్థిక శ్రేయస్సు, ప్రశాంతత చేకూరుతాయి. అయితే దీనిని సరైన రోజున, సరైన దిశలో నాటినప్పుడే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. వాస్తు నిపుణుల ప్రకారం మనీ ప్లాంట్ నాటడానికి అత్యంత శుభప్రదమైన రోజు ఏది..? అలాగే మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటికి ఏ దిశలోనే ఉంచాలి. అనేది తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. దీనివల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తితో పాటు ఆర్థిక ఎదుగుదల లభిస్తుంది.

జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం, మనీ ప్లాంట్ నాటడానికి శుక్రవారం అత్యంత శుభప్రదమైన రోజు. శుక్రవారం సంపదకు, వైభవానికి అధిదేవత అయిన శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున మనీ ప్లాంట్ నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ధనధాన్యాలకు కొదవ ఉండదు.

Money Plant On Friday

శుక్రవారం శుక్ర గ్రహానికి సంకేతం. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. అందువల్ల శుక్రవారం నాడు ఈ మొక్కను నాటడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే, మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశలో మాత్రమే ఉంచాలి. ఆగ్నేయ దిశకు అధిపతి గణపతి కాగా, గ్రహం శుక్రుడు. అందువల్ల ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, సానుకూల శక్తి పెరుగుతుంది.

ఏ దిశలో ఉంచకూడదు?: మనీ ప్లాంట్‌ను పొరపాటున కూడా ఈశాన్యం దిశలో ఉంచకూడదు. ఈశాన్యానికి అధిపతి గురు గ్రహం. శుక్రుడు, గురువు శత్రు గ్రహాలు కావడం వల్ల ఈశాన్యంలో మనీ ప్లాంట్ ఉంచితే ఆర్థిక నష్టాలు, గృహంలో అశాంతి కలిగే ప్రమాదం ఉంది. మనీ ప్లాంట్ తీగలు నేలను తాకకూడదు, ఎల్లప్పుడూ పైకి ఎదిగేలా తాడు లేదా కర్ర సహాయంతో కట్టాలి.

ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. మనీ ప్లాంట్‌ను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు, ఇది మీ ఇంటి లక్ష్మిని ఇతరులకు ఇచ్చినట్లే అని నమ్ముతారు. సరైన వాస్తు నియమాలు పాటిస్తూ శుక్రవారం రోజున ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడి, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.