
ఆపిల్: అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఆపిల్‌లను ఇష్టపడే వ్యక్తులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులు. వారు ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడతారు. వారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. వారు మనస్సు మరియు శరీరం రెండింటినీ ఆరోగ్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. వారు అందరితో స్వేచ్ఛగా మాట్లాడే బహిర్ముఖులు.

నారింజ: మీరు నారింజలను ఇష్టపడే వ్యక్తి అయితే మీరు ఓర్పు, దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని అర్థం. మీరు ఏ పనినైనా చేయాలని ప్రయత్నింస్తే దానిపై దృడంగా నిలబడతారు.మీరు ఏ పని చేసినా నమ్మకంగా చేస్తారు. మీరు చాలా నిజాయితీగా ఉంటారు. అబద్దం చెప్పడానికి అస్సలు ఇష్టపడరు.

మామిడి: పండ్లలో రాజు అయిన మామిడి చాలా మంది తినడానికి ఇష్టపడే పండు. ఈ పండును ఇష్టపడే వ్యక్తులు కొంచెం మొండిగా ఉండవచ్చు. వారు ప్రతి విషయంపై బలమైన అభిప్రాయాలను కలిగి ఉండే తార్కిక ఆలోచనాపరులు. వారు ఎల్లప్పుడూ భావోద్వేగాల కంటే వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు.

పుచ్చకాయ: పుచ్చకాయను ఇష్టపడే వ్యక్తులు చాలా తెలివైన వ్యక్తులు. వారు ప్రతి పనిని తెలివితేటలతో చేస్తారు. అలాగే, వీరు కష్టపడి పనిచేసేయడానికి ఇష్టపడుతారు. బలమైన సృజనాత్మక భావం కలిగి ఉంటారు. పియర్ పండ్లను ఇష్టపడే వ్యక్తులు చాలా ఉత్సాహంగా ఉంటారు. వారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. వీరికి కోపం త్వరగా వస్తుంది. అలాగే వీరు చాలా సున్నితంగా, ఉల్లాసంగా ఉంటారు.

అరటిపండు: అరటిపండ్లను ఇష్టపడే వ్యక్తులు చాలా సున్నితంగా, మధురంగా ఉంటారు. వారు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. వారు మర్యాదగా ప్రవర్తిస్తారు. వారు దయగలవారు కూడా. అరటిపండ్లను ఇష్టపడే వ్యక్తులు ఆత్మవిశ్వాసం లేకపోవచ్చు, కానీ వారు తమ తప్పులను పునరావృతం చేయకుండా వాటి నుండి నేర్చుకుంటారు.