
వర్షాకాలంలో తేలికైన, త్వరగా ఆరే బట్టలు ధరించడం మంచిది. కాటన్, లినెన్ వంటివి అనుకూలంగా ఉంటాయి. సింథటిక్ బట్టలు, స్కిన్ టైట్ దుస్తులు, పొడవాటి బట్టలు, అలాగే బూజు పట్టే అవకాశం ఉన్న బట్టలను ధరించకపోవడం మంచిది.

సాధారణంగా మిగతా వాతావరణంలో వేసుకునే బట్టలు వర్షాకాలంలో సరిపోవు. కాబట్టి ఈ సీజన్ లో రాజీ పడకుండా మీకు కంఫర్ట్ గా ఉండే బట్టలనే వేసుకోవాలి. మందంగా ఉన్న బట్టలు కాకుండా సన్నగా వదులుగా ఉండే బట్టలు వేసుకొంటే వర్షంలో తడిచిన త్వరగా ఆరిపోతాయి. దీంతో మన బాడీకి ఎలాంటి సమస్యలు ఉండవు.

అలాగే లూజ్ గా ఉండే ప్యాంట్స్, టీ షర్ట్స్, లైట్ వెయిట్ గా ఉండే బట్టలు వేసుకోవచ్చు. పాలిస్టర్ బట్టలు అయితే ఈ టైమ్ లో బెస్ట్ అని చెప్పవచ్చు. వీటితో వర్షంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండవచ్చు.

వానాకాలంలో ఆడవారు చీరలు, చుడీదార్స్, కుర్తలు వేసుకోకపోవడమే మంచింది. ఈ బట్టలపై బురదపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఇవి అంత త్వరగా రాకపోవడమే.

ఏ కాలంలో అయినా ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది జీన్స్ ని ఇష్టపడతారు. జీన్స్ ని ఎప్పుడైనా, ఎక్కడైనా వేసుకుంటారు. రెయినీ సీజన్ లో జీన్స్ వేసుకోకపోవడమే మంచిది. ఇవి ఆరడం కూడా చాలా కష్టం కాబట్టి వీటిని ఈ కాలంలో ప్రిఫర్ చేయకపోవడమే బెటర్.