
పాలను మరిగించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కానీ 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు పాలను మరిగించకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పోషకాలను కోల్పోతుంది. పాలను ఐదు నుంచి పది నిమిషాలు మీడియం మంట మీద మాత్రమే మరిగించాలి.

కండరాల పెరుగుదలకు అవసరం అయ్యే అనేక పోషకాలు పాలలో ఉంటాయి. పాలలో ఉండే ప్రోటీన్లు కండరాలను నిర్మించేందుకు, కండరాల మరమ్మత్తులకు సహాయ పడతాయి. వ్యాయామం చేసిన తరువాత పాలను తాగితే కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. అలాగే కండరాలు నిర్మాణమవుతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది.

పాలలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే కండరాల కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో రాత్రి పూట పిక్కలు పట్టుకుపోవడం వంటి సమస్యలు ఉండవు. అలాగే నాడీ మండల వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. పాలలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాలను నిర్మాణం చేయడంతోపాటు కండరాల దృఢత్వానికి పనిచేస్తుంది.

పాలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం తాగవచ్చు. లేదా రాత్రి నిద్రకు ముందు తాగవచ్చు. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి నిద్రకు ముందు పాలను తాగాలి. ఇక మిగిలిన ఎవరైనా సరే ఉదయం తాగితే మంచిది. దీంతో శరీరానికి కావల్సిన పోషకాలు ఉదయమే లభిస్తాయి.

ఉదయం వ్యాయామం చేసిన అనంతరం పాలను తాగవచ్చు. లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం పాలను తాగవచ్చు. ఇలా పాలను తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా పాలలో ఉండే పోషకాలన్నింటినీ పొందవచ్చు. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇమ్యూనిటీ పెరిగి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.