Kiwi: వామ్మో.. కివి తింటే ఇన్ని సమస్యలా.. ఈ వ్యక్తులు మాత్రం అస్సలు ముట్టుకోవద్దు..

Updated on: Nov 04, 2025 | 6:03 PM

విటమిన్ సి తో పాటు అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్న కివి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మితంగా తీసుకుంటేనే లాభాలు.. కివిని అధిక మొత్తంలో తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కివి వల్ల కలిగే లాభాల గురించి మాత్రమే కాకుండా, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏర్పడే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1 / 5
తీవ్రమైన అలెర్జీ: కివిలో ఆక్టినిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కారణంగా కొంతమందికి అలెర్జీలు రావచ్చు. నోరు లేదా గొంతు దురద పెట్టడం, వాపు రావడం, ఒంటిపై దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు అరటిపండు, అవకాడో లాంటి వాటికి అలెర్జీ ఉంటే, కివి విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.

2 / 5
నోటిలో మంట: కివిలోని ఎంజైమ్ కారణంగా ఎక్కువగా పండని కివి తిన్నప్పుడు కొంతమందికి నోరు, పెదవులు లేదా గొంతులో జలదరింపు లేదా మంట వస్తుంది.
చాలా మందికి ఇది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మంట తగ్గడానికి పండిన కివి తినండి, తొక్క తీయండి.

నోటిలో మంట: కివిలోని ఎంజైమ్ కారణంగా ఎక్కువగా పండని కివి తిన్నప్పుడు కొంతమందికి నోరు, పెదవులు లేదా గొంతులో జలదరింపు లేదా మంట వస్తుంది. చాలా మందికి ఇది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మంట తగ్గడానికి పండిన కివి తినండి, తొక్క తీయండి.

3 / 5
జీర్ణ సమస్యలు: కివిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే అయినా మరీ ఎక్కువగా తింటే ఇబ్బందులు వస్తాయి. ఎక్కువగా కివి తింటే గ్యాస్, ఉబ్బరం, లేదా విరేచనాలు కావచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు కివీలు మాత్రమే తినండి. వాటిని ఖాళీ కడుపుతో తినకుండా ఉండండి.

4 / 5
మందులతో సమస్య: కివిలో పొటాషియం ఉంటుంది. గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు కోసం మందులు తీసుకునేవారు కివిని ఎక్కువ తీసుకుంటే.. రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి సమస్యలు రావచ్చు. అలాగే రక్తాన్ని పలచబరిచే మందులు తీసుకునేవారు కివి ఎక్కువగా తినే ముందు డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

5 / 5
చర్మంపై దద్దుర్లు: కివి తొక్కపై ఉండే సన్నని వెంట్రుకల వంటి ఫైబర్స్ చర్మానికి తగిలినా లేదా కివి తిన్నా అలెర్జీ ఉన్నవారికి చర్మంపై దురద లేదా ఎరుపు దద్దుర్లు రావచ్చు. దద్దుర్లు వస్తే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడగండి. కాగా కివి ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దాన్ని మితంగా తినడం చాలా ముఖ్యం.