
నోటి పూత వస్తే ఏ ఫుడ్స్ కూడా తినలేము. అలాగే, ఒక్కోసారి అయితే మంచి నీళ్లు కూడా తాగలేము. సాధారణంగా ఇవి మన శరీరంలో ఇతర లోపాలు ఉన్నప్పుడు ఇలా వస్తాయి. నెలలో మూడు నాలుగు సార్లు ఇలాగే వస్తే దానిని తేలికగా వదిలేయొద్దు.

కాబట్టి, నోటి పూతలు వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అసలు ఈ నోటి పూతలు ఎందుకు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

శరీరంలో ఐరన్ లోపం కానీ, జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇలా నోటి పూతలు వస్తాయి. ఒక్కోసారి ఎక్కువ స్పైసీ ఉన్న ఫుడ్స్ తీసుకున్నా నోటిపూతలు వస్తాయి.

స్మోకింగ్ చేస్తున్న వారికీ నోటి పూత సమస్య వస్తే కొంచం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఎందుకంటే పొగాకు చాలా డేంజర్. ఇది నోటి మ్యూకస్ లైనింగ్ ను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి, దీనికి దూరంగా ఉండండి.

డయాబెటిక్ తో బాధపడుతున్నవారికీ నోటి పూతలు వస్తే అనారోగ్య సమస్యగా పరిగణించండి. అలాగే, విటమిన్ B12 లోపం ఉన్నా కూడా పూతలు ఎక్కువగా నిపుణులు చెబుతున్నారు.