Health tips: విటమిన్-డి లోపం ఉందని చెప్పే ముఖ్యమైన లక్షణాలు ఇవి..అది పెరగాలంటే ఇలా చేయాల్సిందే..!

|

Nov 26, 2023 | 5:12 PM

విటమిన్ డి శరీరానికి అవసరమైన పోషకం. విటమిన్ డి మన శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. పిల్లల ఆరోగ్యానికి విటమిన్ డి చాలా ముఖ్యం. విటమిన్ డి శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అందువల్ల శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇతర విటమిన్ల వలె, విటమిన్ డి మూలం ఆహారం కాదు. ఇది సూర్యకాంతి నుండి లభిస్తుంది. ఏయే ఆహారాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
విటమిన్-డి లోపంతో ఇబ్బందిపడుతున్న వారిలో విపరీతమైన వెన్నునొప్పి సమస్య ఉంటుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. జుట్టురాలిపోయే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వాపు, నొప్పులు వంటి లక్షణాలు కూడా విటమిన్-డి లోపం కారణంగా ఎదుర్కొంటారు.

2 / 6
అకస్మాత్తుగా మానసిక ఆందోళన కలగడం, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా విటమిన్ డి లోపం లక్షణాలు. ఆరెంజ్ జ్యూస్ విటమిన్ డికి మంచి మూలం. కాబట్టి రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచిది.

3 / 6
శరీరంలో ఎముకల పటిష్టత, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ డి అత్యంత కీలకం. విటమిన్ డి లోపం ఉన్నవారు తక్కువ వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉంటారు. విటమిన్-డి లోపం ఉన్నవారిలో తరచుగా జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. సాల్మన్ వంటి కొవ్వు చేపలు విటమిన్ డికి మంచి మూలం. కాబట్టి వీటిని తినడం వల్ల విటమిన్ డి అందుతుంది.

4 / 6
విటమిన్ డి లోపంతో బాధపడుతున్నవారు త్వరగా అలసిపోతారు. చిన్న చిన్న పనులకే అలసటగా ఫీలవుతారు. అంతే కాదు వీరిలో నిద్రలేమి ప్రధానమైన సమస్యగా మారుతుంది. ఉన్నట్టుండి ఎముకల నొప్పి, కండరాల నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కూడా విటమిన్ డి లోపం వల్ల కలుగుతాయి. గుడ్డు పచ్చసొన నుండి విటమిన్ డి పొందవచ్చు. కాబట్టి రోజూ ఉదయాన్నే గుడ్డు తినడం మంచిది.

5 / 6
బాదం పాలు, సోయా మిల్క్, ఓట్ మిల్క్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా శరీరంలో విటమిన్ డి అందుతుంది. అలాగే, పుట్టగొడుగులు విటమిన్ డి  మంచి మూలంగా పరిగణించబడే ఆహారం. కాబట్టి చలికాలంలో పుట్టగొడుగులను కూడా తినవచ్చు. అలాగే, పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా విటమిన్ డికి అద్భుతమైన మూలం.

6 / 6
పైన చెప్పిన లక్షణాలతో బాధపడేవారు విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి. దాంతో పాటుగా ఉదయం పూట సూర్యరశ్మిని శరీరానికి తగిలేలా చూసుకోండి. సూర్యరశ్మి మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. పాలు, పెరుగు, వెన్న మరియు చీజ్ వంటి పాల ఉత్పత్తుల నుండి శరీరానికి విటమిన్ డి లభిస్తుంది.