Sprouted Potatoes: మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుందో తెలుసా?

Updated on: Dec 31, 2025 | 12:54 PM

దాదాపు ప్రతి ఒంటి వంట గదిలో బంగాళాదుంపలు కనిపిస్తాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని కొందరు మార్కెట్ నుంచి అధిక మొత్తంలో వీటిని తెచ్చి నిల్వ చేస్తుంటారు. అయితే వీటిని తెచ్చి ఎక్కువ రోజులు అలాగే వదిలేస్తే.. మొలకలు వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలో మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం సురక్షితమేనా? అనే సందేహం చాలా మందికి వస్తుంది..

1 / 5
దాదాపు ప్రతి ఒంటి వంట గదిలో బంగాళాదుంపలు కనిపిస్తాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని కొందరు మార్కెట్ నుంచి అధిక మొత్తంలో వీటిని తెచ్చి నిల్వ చేస్తుంటారు. అయితే వీటిని తెచ్చి ఎక్కువ రోజులు అలాగే వదిలేస్తే.. మొలకలు వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలో మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం సురక్షితమేనా? అనే సందేహం చాలా మందికి వస్తుంది.

2 / 5
నిజానికి ఇలాంటి వాటిని తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంపలలో సోలనిన్, చాకోనిన్ అనే రెండు సహజ రసాయనాలు (గ్లైకోఅల్కలాయిడ్స్) ఉంటాయి. తక్కువ మొత్తంలో ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అయితే బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు సోలనిన్, చాకోనిన్ స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల ఇటువంటి బంగాళాదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం.

3 / 5
మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇది తక్కువ రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరుగుదల, జ్వరం, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరం.

4 / 5
బంగాళాదుంప ఆకులు, పువ్వులు, తొక్కలు, కాండం ఎక్కువ హానికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. బంగాళాదుంప ఆకుపచ్చగా, పగుళ్లుగా, చేదు రుచిని కలిగి ఉంటే ఈ పదార్థాలు అందులో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

5 / 5
బంగాళాదుంపలను ఉడకబెట్టడం, మైక్రోవేవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం తగ్గదు. అలాగే బంగాళాదుంపల దెబ్బతిన్న లేదా ఆకుపచ్చ భాగాలను కత్తిరించడం వల్ల కూడా ప్రమాదం తగ్గదు. కాబట్టి అలాంటి బంగాళాదుంపలను ఆహారానికి వినియోగించకపోవడమే బెటర్‌.