Green Tea: వర్షాకాలంలో గ్రీన్ టీ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

Updated on: Jul 22, 2025 | 5:17 PM

గ్రీన్ టీ.. ఇది ఒక ఆరోగ్యకరమైన పానీయం. ఇటీవలి కాలంలో ప్రజల్లో గ్రీన్‌ టీ వినియోగం విపరీతంగా పెరిగింది. పాలతో చేసిన టీకి, కాఫీ కి బదులుగా గ్రీన్ టీ తాగేవారు ఎక్కువగా ఉన్నారు. గ్రీన్ టీ తాగితే కొవ్వు తగ్గుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకునేవారిలో జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. తద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు గ్రీన్ టీ తాగితే మంచిది. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తాగితే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత వర్షాకాలంలో గ్రీన్‌ టీ తాగితే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
వేసవితో పోల్చితే వర్షాకాలంలో గ్రీన్ టీ తాగితే చాలా ప్రయోజనాలుంటాయి. పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి గ్రీన్ టీని తాగితే  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

2 / 5
గ్రీన్ టీలోని టానిన్ శరీరంలో ఐరన్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల మీరు బలహీనంగా ఉంటారు. గ్రీన్ టీలో ఉండే విటమిన్లు,  యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో  సహాయపడతాయి.

3 / 5
వర్షాకాలం వేళ సుగంధ ద్రవ్యాలతో చేసే గ్రీన్  టీ ఎంతో ఉత్తమం. ఇది కేవలం రుచిలో మాత్రమే కాదు..దీంతో శరీరానికి వెచ్చదనం కూడా దొరుకుతుంది. ఏ సీజన్‌లోనైనా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా కీలకం అయినప్పటికీ. వర్షాకాలంలో తరచుగా నీరు తీసుకోవడం తగ్గుతుంది. కాబట్టి , గ్రీన్ టీ తీసుకుంటే... శరీరం ఎంతో హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

4 / 5
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. ఇది గ్యాస్ట్రిక్, యాసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కడుపులో యాసిడ్ స్థాయి పెరిగి గ్యాస్, మలబద్ధకం, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చు.

5 / 5
వర్షాకాలంలో అల్లం, తులసి, లైకోరైస్ రూట్ వంటి పదార్థాలతో చేసే గ్రీన్ టీ తాగడం వల్ల ఉపశమనం పొందొచ్చు. గొంతు నొప్పి కూడా రాదు. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో వివిధ సమస్యలు తలెత్తడం ప్రారంభిస్తాయి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.