
స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొలెస్ట్రాల్, ఊబకాయం తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి.. శరీరంలో కొవ్వును కాల్చే కొన్ని డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ - జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాట్ బర్నింగ్ చేసి ఊబకాయాన్ని తగ్గించే చిట్కాలు, డిటాక్స్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

వాస్తవానికి, చలికాలం వచ్చిందంటే చాలా మంది ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువగా తింటారు. అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు అధిక కేలరీల ఆహారాన్ని తినడం మానుకోవాలి.

Green Tea

దాల్చిన చెక్క నీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంటు వ్యాధులు, వ్యాధుల నుండి మీ శరీరాన్ని కాపాడుతుంది. దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు. దీన్ని తాగడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండదు.

అల్లం నీటిలో ఉండే జింజెరాల్, షోగోల్ వంటి సమ్మేళనాలు ఆర్థరైటిస్, గుండె జబ్బులతో సహా తాపజనక సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అల్లం నీరు చర్మ సంబంధిత సమస్యల నుండి రక్షించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.

సోంపు గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. సోంపు గింజలను గోరువెచ్చని నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఈ నీటిని తాగండి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.