1 / 6
ప్రస్తుతకాలంలో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ అనేది సాధారణ సమస్యగా మారింది. ఇది శరీర ఆకృతిని దెబ్బతీయడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా ఊబకాయం బీపీ, గుండె సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే.. దానిని తగ్గించుకోవాలనుకుంటే.. వెల్లుల్లి మీకు దివ్యౌషధం. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలతోపాటు అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి తినడంలో కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా పొట్ట కొవ్వును తగ్గించుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..