High Cholesterol: ఈ పండ్లతో అధిక కొలెస్ట్రాల్‌కు, ఊబకాయానికి చెక్ పెట్టొచ్చు.. అవేంటో తెలుసుకోండి..

|

Jun 10, 2022 | 12:56 PM

High Cholesterol Level: ఊబకాయంతో బాధపడేవారు.. అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి అనేక మందులు తీసుకోవడంతోపాటు పలు రకాల డైట్‌లను పాటిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పెరిగిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

1 / 6
అధిక కొలెస్ట్రాల్ కారణంగా అనేక గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, మీరు అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

2 / 6
ఆపిల్: అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఆపిల్‌ పండ్లను తినవచ్చు. ఇందులో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది. ఇది పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

3 / 6
అవకాడో: అవకాడో పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి.

4 / 6
సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలో నారింజ, ద్రాక్షపండు, నిమ్మ వంటి పండ్లు ఉంటాయి. విటమిన్ సి పండ్లలో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది. సిట్రస్ పండ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల వాటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 6
బొప్పాయి: బొప్పాయిలో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి పనిచేస్తాయి. దీంతోపాటు బొప్పాయి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల దీనిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

6 / 6
ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే.. హై కోలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.