Weight loss: జిమ్‌ వెళ్లే పనిలేదు.. ఇలా చేస్తే.. మీ కొవ్వు వెన్నలా కరగాల్సిందే

Updated on: Nov 21, 2025 | 3:32 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది స్లిమ్‌గా కనిపించాలని అనుకుంటున్నారు. అందుకే జిమ్‌కు వెళ్లడం, వర్కౌట్స్ చేయడం, డైట్‌ ఫాలో అవ్వడం చేస్తున్నారు. కానీ ఇంత చేసిన కొందరు పూర్తి స్థాయిలో వాటి ఫలితాలను పొందలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ కథనం.. మీ రోజువారి జీవింతలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు అలాగే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5
 ఈ రోజుల్లో బరువు పెరగడం ఒక పెద్ద సమస్య. మారుతున్న ఆహారపు అలవాట్లు, బయట దొరికే ఆయిలీ, కల్తీ ఫుడ్‌ కారణంగా చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. ఇందుకు తోడు మనుషులు శారీరక శ్రమను పూర్తిగా మర్చిపోయారు. పద్దస్తమానం ఉన్న చోటే కూర్చొని పని చేయడం కూడా ఒక కారణం.

2 / 5
 ఇక ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు జిమ్‌కు వెళ్లడం, కొందరు సప్లిమెంట్స్ తీసుకోవడం.. ఇలా ఎన్ని చేసినా వారు ప్రయోజనాలను పొందలేక పోతున్నారు. బరువు తగ్గాలంటే కొన్ని విషయాలను పాటించడం చాలా ముఖ్యం.

3 / 5
 మీరు త్వరగా బరువు తగ్గడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. అవును.. బరువు తగ్గడానికి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు గ్లాసుల నీరు త్రాగాలి. దానితో పాటు సరైన సమయంలో వ్యాయామం చేయాలి.

4 / 5
 ప్రతి భోజనానికి అరగంట ముందు మీరు రెండు గ్లాసుల నీరు త్రాగాలి. వీలైనంత ఎక్కువ నీరు త్రాగడంపై దృష్టి పెట్టండి. ఇది మిమ్మల్ని త్వరగా బరువు తగ్గేలా ప్రోత్సహిస్తుంది. దీనికి తోడూ మీ ఆహారంలో కొవ్వును తగ్గించే పోషకాలు ఉండేలా చూసుకోండి

5 / 5
అలాగూ రోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగడం లాంటిది కాదు, కొన్ని సందర్భాల్లో నిమ్మకాయ నీటిని తాగడం కూడా బరువు తగ్గేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవన్ని పాటిస్తే.. మీరు కొన్ని రోజుల్లోనే మీలో మార్పును గమనిస్తారు.(NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. టీవీ9 వీటిని దృవీకరించట్లేదు)