
నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత ఉత్తర తమిళనాడు తీరప్రాంతములో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టంనకు 5.8 కి.మీ ఎత్తువరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుంది. వేరొక ఉపరితల ఆవర్తనం మధ్య అండమాన్ సముద్ర ప్రాంతములో సగటు సముద్ర మట్టంనకు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. దీని ప్రభావంతో అక్టోబరు 21 తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతములో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ అక్టోబర్ 23వ తేదీన వాయుగుండముగా బలపడే అవకాశముంది.

దీంతో పాటు తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడన ప్రాంతం నుండి ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక, రాయలసీమ అంతర్భాగముగా దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ విస్తరించి ఈరోజు తక్కువగా గుర్తించబడినది. వీటి ప్రభావంతో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది. ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది. ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ:- శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది. ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది.