Bugga Ramalingeswara Swamy: నిరంతరం ఉబికివస్తున్న నీరు.. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర

Edited By:

Updated on: Jan 18, 2025 | 4:43 PM

Bugga Ramalingeswara Swamy: రాళ్లమధ్యలో పారుతున్న నీటిని బుగ్గగా పిలుస్తారు. ఈ బుగ్గ ద్వారా వచ్చే నీరు ఎంతటి కరువు సమయంలో కూడా పారుతుండడం విశేషం. వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసి తమ పూజా కార్యక్రమాలకు అనువుగా ఉండేలా శివలింగాన్ని..

1 / 5
రంగులపూలతో విరగబూసిన చెట్లు. పక్షుల కిలకిలరావాలు, చుట్టూ ఎత్తయిన గుట్టలు.. శత మర్కటాల విన్యాసాలు. ఇలా ప్రకృతి అందాలు మధ్యల వాటి మధ్యలో వెలసింది బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఆ ప్రాంతం అంత ఆహ్లాదకరవాతావరణం. బండ రాళ్ల మధ్య నుంచి ఉబికి వచ్చే జలధార భక్తులను అబ్బురపరుస్తోంది. నాలుగు శతాబ్ధాల ఘనమైన చరిత్ర ఉంది. అప్పటి నుంచి తరగని జలధి ఆ ఆలయం సొంతం.

2 / 5
వివరాల్లోకి వెళితే.. ప్రతి ఏటా మాఘ అమవాస్య రోజున ఘనంగా నిర్వహించబడే జాతర, ఇవన్నీ ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామ  శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల ప్రాముఖ్యత, దేవాలయ ప్రాంగణంలో బండరాళ్ల మధ్య నుండి సన్నని జలధార ఇక్కడ ఉన్న  మహాత్యం.. నిరంతరం ఈ జల ధార ప్రవహిస్తూ ఉండడడంతో బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం అని పేరు వచ్చింది. వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రాంతంలో మునులు తపస్సుచేసి శివలింగాన్ని  ప్రతిష్టించిన విగ్రహంపై ఈ దేవాలయంలోని లింగమూర్తి అని ఇక్కడి ప్రజలు పిలుస్తూ కథలుగా చెప్పు కుంటారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో మునులు నడియాడడం వల్లనే ఎవరికి అంతుచిక్కని రీతిలో బండరాళ్ల మధ్యలో నుండి నీటి  ప్రవాహం ఉంటుందని భక్తులు నమ్ముతారు.

3 / 5
ఆలయానికి ఎలా వెళ్లాలి?: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి 6 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం ఉన్నది. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజు ఉగాది, శ్రీరామ నవమి రోజుల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి చుట్టపక్కల గ్రామాల ప్రజలతోపాటు ఇతర మండలాలైన కోనరావుపేట, మాచారెడ్డి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలకు చెందిన వారు అత్యధికంగా వస్తుంటారు. మండల కేంద్రం నుండి ప్రస్తుతం బస్సులతో పాటు ఆటోలు అందుబాటులో ఉంటాయి.

4 / 5
కరువులోనూ తరగని జలనిధి: రాళ్లమధ్యలో పారుతున్న నీటిని బుగ్గగా పిలుస్తారు. ఈ బుగ్గ ద్వారా వచ్చే నీరు ఎంతటి కరువు సమయంలో కూడా పారుతుండడం విశేషం. వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసి తమ పూజా కార్యక్రమాలకు అనువుగా ఉండేలా శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ కథరూపంలో ఉంది. మునులు నడియాడిన ప్రాంతం వలనే ఈ. బండరాళ్ల మధ్యలో నుండి నీరు సన్నని ధారలాగా ప్రవహిస్తుందడంతో అలయానికి బుగ్గ రామలింగేశ్వరుడుగా నామకరణం చేశారు. ఈ బుగ్గద్వారా వచ్చిన నీరు ఆలయ సమీపంలో ఉండే కోనేరులోకి వస్తుంది. కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి రామలింగేశుని దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పుణ్యం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. ఈ కోనేరు నిండుగా పారే నీటిని ఈ ప్రాంత వాసులు తమ పొలాలకు పారించుకొని పంటలు పండిస్తారు. అలాగే భక్తులు కోనేరులోని ఈ నీటిని బాటిల్లలో ఇంటికి తీసుకెళ్తారు. సుదూరప్రాంతాలకు చెందిన రైతులు బాటిల్లలో తీసుకెళ్లిన ఈ నీటిని తమ పంటపొలాల్లో చల్లుకోవడం వలన చీడపురుగుల బారినుండి కపాడుకుంటారు.

5 / 5
సమష్టి కృషితో ఆలయానికి దారి ఏర్పాటు: గతంలో ఈ ఆలయానికి వెళ్లడానికి సరైన రహదారి లేకపోవడం వలన భక్తులు ఇబ్బందులు పడేవారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు, గ్రామస్తులు, స్థానికులు, భక్తుల సహకారంతో  రహదారి ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం  మంజూరు చేసిన నిధుల ద్వారా ఈ ఆలయం వరకు పక్కా రోడ్డు నిర్మాణం కూడా చేసారు  గ్రామానికి చెందిన కొందరు యువకులు పుణ్యదినాలలో ఇక్కడికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా పలు ఏర్పాట్లు చేస్తున్నారు.