
రక్తహీనత: విటమిన్ బీ12 లోపమే రక్తహీనతకు ప్రధాన కారణం. శరీరంలో రక్తం పరిపడినంతగా లేకపోతే వెంటనే అలసిపోవడం, కళ్లు తిరగడం, పీలగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే ఈ సమస్యను అధిగమించకుంటే శరీరంలో రక్తం కోరత మరింతగా పెరిగి, గుండెపై చెడు ప్రభావం చూపుతుంది.

మూడ్ స్వింగ్స్: ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు విటమిన్ బీ12 లోపం కూడా కారణమే. విటమిన్ బి12 లోపం కారణంగా మీరు నిత్యం అందోళన చెందడం, చిన్న సమస్యలకే టెన్షన్, కంగారు, మానసికంగా కృంగిపోవడం, భావోద్రేకానికి గురికావడం వంటివి జరుగుతుంటాయి.

జ్ఞాపకశక్తి సమస్యలు: విటమిన్ బీ12 లోపం కారణంగా ఎదురయ్యే మరో సమస్య జ్ఞాపకశక్తి లోపించడం. నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే.. విటమిన్ బి12 లోపం వల్ల కొన్ని సందర్భాలలో మీరు కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేనట్లుగా ప్రవర్తిస్తారు.

అలసట: రాత్రిపూట మీరు ఎంత గాలి వీచే ప్రదేశంలో ఉన్నా చెమటలు పడుతున్నట్లయితే విటమిన్ బీ 12 లోపం కారణంగా ఎదురైన సమస్యేనని గుర్తించాలి. అలాగే చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఆలసట చెందిన భావన పొందుతారు.

కండరాల బలహీనత: విటమిన్ బీ12 లోపం కారణంగా మీ కండరాలు కూడా బలహీనంగా మారుతాయి. చిన్న చిన్న వస్తువులను పట్టుకోవడానికి సైతం మీరు తీవ్ర ఇబ్బంది ఫీలవుతారు.