ఈ ప్రపంచంలో ప్రకృతి ద్వారా సృష్టించబడిన అనేక జీవులు ఉన్నాయి. అందులో ఈ సాలీడు ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలీడు.
దీనిపేరు ఫన్నెల్ వెబ్ స్పైడర్. ఇది మనుషులను కరిస్తే బతకడం చాలాకష్టం. ఆస్ట్రేలియా అడవులలో కనిపించే ఈ సాలీడు అక్కడ చాలా మందిని పొట్టనపెట్టుకుంది.
ఈ సాలీడు కరిచిన తర్వాత ఆ వ్యక్తి భయంకరమైన నొప్పితో 15 నిమిషాల్లో చనిపోతాడు. ఫన్నెల్ వెబ్ స్పైడర్ 1 నుంచి 2 అంగుళాల పరిమాణంలో నలుపు రంగులో ఉంటుంది. శరీరంపై నల్లటి వెంట్రుకలు ఉంటాయి.
ఈ సాలీడు విషం నేరుగా మానవ గుండెను పంపింగ్ చేయడాన్ని ఆపివేసి, కాటు వేసిన ప్రదేశంలో వాపు వస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే మరణం ఖాయం.