
బ్రెజిలియన్ సాలీడు: ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సాలీడు. ఇది న్యూరో టాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సాలీడు కరిస్తే వెంటనే వ్యక్తి కండరాలపై నియంత్రణ కోల్పోయి మరణిస్తాడు.

సిడ్నీ ఫన్నెల్ వెబ్: ఇది ప్రపంచంలో రెండో అత్యంత ప్రమాదకరమైన సాలీడు. ప్రపంచంలోని ప్రాణాంతకమైన సాలెపురుగులలో ఇది ఒకటి. ఇది కరిచిందంటే మనిషి నురుగులు కక్కుతూ మరణిస్తాడు.

రెడ్‌బ్యాక్ / బ్లాక్ విడో స్పైడర్: ఆస్ట్రేలియాలో కనిపించే ఈ స్పైడర్ ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే దీనిని సులభంగా గుర్తించవచ్చు. ఇవి ఆడ సాలెపురుగులు. సంభోగం తర్వాత మగసాలెపురుగులను చంపి తింటాయి.

బ్రౌన్ రిక్లూస్ స్పైడర్: దీనిని వయోలిన్ లేదా ఫిడేల్ బ్యాక్ స్పైడర్ అంటారు. ఈ జాతుల సాలెపురుగులు అమెరికాలోని పశ్చిమ, ఆగ్నేయ భాగాలలో కనిపిస్తాయి. ఇది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సాలెపురుగులలో ఒకటి.

సిక్స్ ఐ శాండ్ స్పైడర్: ఎవరైనా తమ దగ్గరకు వస్తే ఈ సాలెపురుగులు వెంటనే ఇసుకలో దాక్కుంటాయి. ఇవి కరిస్తే ఒక వ్యక్తి కొన్ని గంటల్లో మరణిస్తాడు.