uppula Raju |
Jul 14, 2021 | 10:32 AM
పురుగుమందులు: మన దేశంలో మంచి దిగుబడి కోసం వీటిని ఉపయోగిస్తారు.కానీ విదేశాలలో 60 హానికరమైన పురుగుమందులు నిషేధించబడ్డాయి.
రెడ్ బుల్: ఈ ఎనర్జీ డ్రింక్ అంటే యువత చాలా ఇష్టపడతారు. అయితే రెడ్ బుల్ ను ఫ్రాన్స్, డెన్మార్క్ లలో నిషేధించారు. ఈ పానీయం గుండెపోటు, నిర్జలీకరణం, రక్తపోటును ప్రోత్సహిస్తుందని ఈ దేశాల సంబంధిత విభాగాలు నమ్ముతున్నాయి.
జెల్లీ కాండీ: ఈ మిఠాయిని పిల్లలు ఎంతో మక్కువతో తింటారు కానీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో వీటి అమ్మకం పూర్తిగా నిషేధించారు. అక్కడ పిల్లల ఆరోగ్యానికి ఇవి హానికరమని భావిస్తారు.
డిస్ప్రిన్ : మనకు తలనొప్పి వచ్చినప్పుడు త్వరగా డిస్ప్రిన్ తీసుకుంటాం. కానీ విదేశాలలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందుకు దీనిని నిషేధించారు.
లైఫ్‌బాయ్ సోప్: అమెరికాతో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సబ్బును నిషేధించారు. అమెరికా ప్రకారం ఈ సబ్బు చర్మానికి హానికరం. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సబ్బును జంతువులను స్నానం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.