
మనలో చాలా మంది నాణేలను ఒకదానిపై మరొకటి జమ చేయడం ఒక కళాకండాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ తనూ మాత్రం ఈ సరదా ప్రయత్నానికి సరికొత్త రూపుదిద్ది.. అద్భుతాన్ని సృష్టించాడు.

రకరకాల నాణేలను ఉపయోగించి.. వివిధ ఆకారాలు, పరిమాణాలలో కళాకృతులు సృష్టించాడు. ఇలాంటి కళాకండాలు మరెవరూ తయారు చేయలేరని భావించేలా డిజైన్లు రూపొందించాడు. ఇందుకోస వేర్వేరు పరిణామాల నాణెలను ఉపయోగించాడు.

ఈ అందమైన కళాఖండాలను చూసిన తరువాత.. మీరు కూడా బాల్యంలో ఏదో ఒక సందర్భంలో ఆడిన ఆటకు సంబంధించి మధురస్మృతులు గుర్తుకు వస్తాయి. అంతేకాదు.. ఈ కళాకృతులు చూసి మీరు కూడా ఒకసారి ప్రయత్నించొచ్చు.

తనూ.. నాణేలను ఒకదానిపై ఒకటి పేర్చడం, వివిధ షేప్స్‌లో అమర్చడం వంటి చేస్తాడు. విగ్రహాలను సైతం నాణేలతో రూపొందిస్తాడు.

తనూ చేసిన కళాఖండాలు చూస్తే.. ఊపిరి బిగపట్టుకుని చూస్తారనడంలో ఎలాంటి సందేహం. ఈ విగ్రహాలు పడిపోతాయా? అనేలా అనిపించినా.. చెక్కు చెదరకుండా అలంకరిస్తాడు తనూ.