
అనంత్ రూపనగుడి అనే భారతీయ రైల్వే అధికారి జూనియర్ సహోద్యోగి తోటలోని కొన్ని అద్భుతమైన చిత్రాలను పంచుకున్నారు. ఆ ఫోటోలు చూసిన వారు తమ దృష్టిని తిప్పుకోలేరు. అనంత్ రూపనగుడి పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

అంతేకాదు ఆ ఫొటోలు ఆ జూనియర్ సహోద్యోగికి గార్డెనింగ్ పట్ల ఉన్న ప్రేమను కూడా చాటుతున్నాయి. ఈ అందమైన ఇల్లు ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలోని ఉంది.

ఇంట్లో ఎక్కడ చూసినా పూల చెట్లే కనువిందు చేస్తున్నాయి. ఇంటిలోని ప్రతి సందు అందమైన పూలతో అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. అతనికి పూల పట్ల ఉన్న మక్కువ తెలిజేస్తుంది

అసలు ఆ ఇల్లు చూస్తే పబ్లిక్ గార్డెన్‌ల కంటే కూడా అత్యంత అందంగా ఉందనిపిస్తుంది ఎవరికైనా.. చూసిన వారు ఫిదా అవుతున్నారు.

ఇండియన్ రైల్వేస్ ఆఫీసర్ అనంత్ రూపనగుడి జూనియర్ సహోద్యోగి గార్డెన్. అతని అభిరుచిని, గార్డెనింగ్ స్కిల్స్ లో ప్రతిభను చూపిస్తుంది. పువ్వుల పట్ల అతనికి ఉన్న ప్రేమకు ప్రతిభింబిస్తుంది. ఆ పూల తేరు

ప్రతి ఏడాది అతని ఇంటి ప్రతి సందులో, మూలల్లో పూలు వికసిస్తాయి. చూపరులకు ఆ తోట ఆహ్లాదకరంగా ఉంటుంది.

అయితే ఈ ఇల్లు ప్రభుత్వ నివాసమా.. లేక సొంత ఇల్లా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందరి హృదయాలను దోచేసింది ఈ నందన వనం అని వ్యాఖ్యానిస్తున్నారు. నిద్ర లేచిన వెంటనే ఈ అందమైన పూల తోటను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.