
ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తులకు కొరత లేదు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. బ్రెజిల్‌కు చెందిన మార్సెలో 'బి-బాయ్' డి సౌజా రిబీరో 'ఏలియన్ డెవిల్' రూపాన్ని పొందాలని.. క్రేజ్‌ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీంతో తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. మార్సెలో శరీరంలోని 98 శాతం నలుపు-నీలం టాటూలతో నింపేసుకున్నాడు. అంతే కాదు నకిలీ కొమ్ములను అతికించుకున్నాడు. పదునైన లోహపు దంతాలను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు నాలుకను కూడా రెండు ముక్కలు చీల్చుకున్నాడు. Image Source: Instagram/@marcelobboy

మార్సెలో ప్రపంచంలోనే విపరీతమైన శరీర మార్పులు చేసుకున్న మొదటి వ్యక్తిగా పేర్కొన్నాడు. అంతేకాదు ఏలియన్ డెవిల్ లా కనిపించేందుకు తన చూపుడు వేలును కోసుకున్నాడు. మార్సెలో తన వింత పిచ్చి కోరికను నెరవేర్చుకోవడానికి ఇప్పటి వరకు 29 వేల పౌండ్లు (మన దేశ కరెన్సీలో దాదాపు 30 లక్షలు) వెచ్చించాడు Image Source: Instagram/@marcelobboy

ప్రపంచంలో చేతులు రెండుగా విడిపోయిన మొదటి వ్యక్తిని నేనే అని మార్సెలో అన్నాడు'. అంతేకాదు తన చూపుడు వేలును శాస్త్ర చికిత్స ద్వారా తీయించుకుని ఇతరుల కంటే తాను భిన్నం అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. గతంలో మార్సెలో తన చేతుల వేళ్లను శస్త్రచికిత్స ద్వారా రెండు భాగాలుగా చేసి వార్తల్లో నిలిచాడు. Image Source: Instagram/@marcelobboy

DailyMail నివేదిక ప్రకారం, మార్సెలో శరీరంపై 1500 పచ్చబొట్లు ఉన్నాయి. అతను ఇతరుల నుండి తనను తాను వేరుగా చేసుకోవడానికి ఇలా చేసాడు. చూపుడు వేలు కత్తిరించడమే ఇందుకు నిదర్శనం. టాటూలతో 98 శాతం శరీరం కవర్ చేసుకున్నాడుImage Source: Instagram/@marcelobboy

ఇన్‌స్టాగ్రామ్‌లో మార్సెలోను 75 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. వ్యక్తి తన విచిత్రమైన ప్రదర్శన కారణంగా అసాధారణ విజయాలు సాధించి ఉండవచ్చు, కానీ అతని రూపాన్ని చూసి అందరూ భయపడతారు. Image Source: Instagram/@marcelobboy