Phani CH |
Mar 07, 2023 | 1:32 PM
తులిప్ పూలతోట అనగానే మనకు కూలీ నెంబవర్ వన్ సినిమాలోని కొత్త కొత్తగా ఉన్నది అనే సాంగ్ గుర్తుకొస్తుంది. చూడగానే కట్టిపడేసే అందం తులిప్ పూల సొంతం.
తలలో పెట్టుకొనేందుకు ఎవరూ ఇష్టపడరు కానీ, గృహాలంకరణలో మాత్రం వాటి రాజసమే సెపరేటు.
భూలోకంలో స్వర్గసీమను తలపించేలా ఉండే ఈ పుష్పాలు ఏటా వసంత రుతువులో విరబూస్తుంటాయి. రంగురంగుల తులిప్ పూల తోటలు హిమాలయాలకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంటాయి.
తులిప్ పూల తోటల్ని చూసేందుకే పర్యాటకులు జమ్ముకశ్మీర్‌కు వెళుతుంటారు. అంతలా మంత్రముగ్దుల్ని చేస్తాయి ఈపూలు. ఈ ఏడాది శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్‌ను పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు.
ఏప్రిల్ 3 నుంచి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివ్‌ను నిర్వహించనున్నారు. దాదాపు 150 జాతులకు చెందిన 3వేల వెరైటీలు తులిప్ ఫెస్టివల్‌లో కొలువుదీరనున్నాయి.
తులిప్ అంటే లాటిన్ భాషలో తలపాగా అని అర్థమట. ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్ పూలలో చాలా వరకు మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది.
కొన్ని రకాల్లో మాత్రం ఒకే కాండానికి నాలుగు పూలు పూస్తాయి. వసంత కాలంలో మూడు నుంచి ఏడు రోజుల పాటు వికసించే ఈ తులిప్ పుష్పాలు దాదాపు అన్ని రంగుల్లో కనులవిందు చేస్తాయి.