uppula Raju |
Oct 29, 2021 | 2:07 PM
ఎలాంటి ఆంక్షలు, భయం లేని అందమైన ప్రదేశానికి వెళ్లాలని అందరూ కోరుకుంటారు. అలాంటిదే ఫ్రెంచ్ పాలినేషియాలోని టికేహౌ ద్వీపం. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ దీవిని 'హనీమూన్ ప్యారడైజ్' అంటారు.
ఇక్కడ మీరు మీ భాగస్వామితో మరపురాని క్షణాలను గడపవచ్చు. టికేహౌ అంటే శాంతియుత ల్యాండింగ్ అని అర్థం.
ఈ ద్వీపంలో అనేక తెలుపు, గులాబీ ఇసుక ద్వీపాలు ఉన్నాయి. వాటి చుట్టూ అనేక కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇవి ఈ ద్వీపం అందాన్ని మరింత పెంచుతాయి.
ఇక్కడికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానిస్తారు. సముద్రం మధ్యలో నివసించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.
ఇక్కడ అద్దెకు లభించే వెకేషన్ హోమ్‌లు ఉంటాయి. ఈ ప్రాంతంలో తుహెరాహెరా అనే గ్రామం ఉంటుంది. ఇది చాలా అందమైన గ్రామం. ఇక్కడ ఫ్రీగా సంచరించవచ్చు.