
Hair Damage

కొబ్బరి నూనెలో కరివేపాకులు వేసి వేడిచేయాలి. చల్లారాక కుదుళ్లు, జుట్టుకు పట్టించి బాగా మర్దన చేసుకోవాలి

అరగంట తర్వాత తలంటుకుంటే సరిపోతుంది. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్ జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉపయోగపడతాయి

ఉల్లి రసంను కొబ్బరి నూనె లేదా మందార పువ్వుల పేస్టుతో కలిపి జుట్టుకు రాసి అరగంట తర్వాత కడిగేస్తే కురులు సమస్యలు దూరమవుతాయి

ఉల్లి రసంలోని సల్ఫర్ కొలాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు ధృడంగా ఉండేలా చేసి, ఆరోగ్యంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది