uppula Raju |
Aug 02, 2021 | 8:58 PM
కెనడియన్ ప్రావిన్స్ బ్రిటిష్ కొలంబియాలో ఉంది. ఇక్కడ మచ్చల సరస్సు ఉంది. దీనిని ప్రమాదకరమైన సరస్సుగా చెబుతారు. ఇందులో మెగ్నీషియం, సోడియం సల్ఫేట్, కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.
నాట్రాన్ సరస్సు- టాంజానియాలోని ఈ సరస్సు అగ్నిపర్వతం పై ఉంటుంది. దీనిలోని నీరు ఎర్రగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో ఖనిజాలు ఉన్నందున ఈ సరస్సులోని నీరు ఆల్కలైన్‌గా ఉంటుంది. ఈ నీటిని ఎవ్వరూ తాగలేరు.
జెల్లీఫిష్ సరస్సు- పలావ్‌లో ఉన్న ఈ సరస్సులో మిలియన్ల కొద్దీ బంగారు రంగు జెల్లీ ఫిష్‌లు కనిపిస్తాయి. ఈ సరస్సులో డైవింగ్ చేస్తే మీరు జెల్లీ ఫిష్‌తో ఈత కొట్టినట్లు అనిపిస్తుంది. అయితే ఈ జెల్లీ ఫిష్‌లు చాలా ప్రమాదకరమైనవి.
మరిగే సరస్సు- ఈ సరస్సు డొమినికాలో ఉంది. 200 అడుగుల వెడల్పు ఉన్న ఈ సరస్సు మధ్యలో నీరు ఎప్పుడూ మరుగుతూ ఉంటుంది. దాని నుంచి ఆవిరి ఎప్పుడూ బయటకు వస్తూ ఉంటుంది.
పింక్ లేక్- ఆస్ట్రేలియాలో ఉండే ఈ సరస్సులో హాలోఫిలిక్ బాక్టీరియా ఉంటుంది. దీని కారణంగా ఈ సరస్సు గులాబీ రంగులో కనిపిస్తుంది. ఈ సరస్సు విస్తీర్ణం 600 చదరపు మీటర్లు మాత్రమే. కనుక ఇది ప్రపంచంలోనే అతి చిన్న, అందమైన సరస్సులో చేర్చారు.