
భారతదేశం-పాకిస్తాన్ విభజన సమయంలో కాపీ-బుక్, టేబుల్-చైర్ నుంచి టైప్ రైటర్, పెన్సిల్ వరకు అన్ని కార్యాలయాల విభజన జరిగింది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మిగిలిపోయిన బ్రిటిష్ వైస్రాయ్ బండ్లు నాణెం పైకి వేసి బొమ్మ, బొరుసు ద్వారా పంపిణీ జరిగాయి. భారతదేశానికి 6, పాకిస్తాన్‌కు 6 వచ్చాయి.

భారతదేశంలో ఉన్న 'నేషనల్ లైబ్రరీ' పుస్తకాల పంపిణీ కూడా జరిగింది. ఇది కాకుండా 'ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా' సగానికి సగం విభజించారు.

ఇండో-పాక్ విభజన సమయంలో రైల్వే విభజన కూడా జరిగింది. రైలు కోచ్‌లు, ఇంజన్‌లు, బుల్డోజర్లు, ట్రక్కులు కూడా విభజించారు.

ఇండో-పాక్ విభజన సమయంలో ఆల్కహాల్ గురించి మాత్రం ఎప్పుడు వివాదాలు లేవు. మద్యం వ్యాపారంలో మాత్రం పాకిస్తాన్ భాగం అడగలేదు.