Photo Gallery: ఈసారి ముంబైలో ప్రత్యక్షమైన మిస్టరీ స్తంభం..ఎవరైనా కావాలని చేస్తున్న పనా? లేదా.. ఏలియన్స్..?
అసలు ఎక్కడివి ఈ మిస్టరీ స్తాంభాలు...? ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు ఇవి ప్రత్యక్షమవుతున్నాయి..? తాజాగా ముంబయిలో కనిపించిన మోనోలిత్ హాట్‌టాపిక్‌గా మారింది . ఇది నిజంగా గ్రహాంతరవాసుల పనా? లేదా ఎవరైనా ఆకతాయిల పనా..?
ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న మిస్టరీ స్తంభాలు
Follow us on
తాజాగా ముంబయిలో ప్రత్యక్షమైన మరో మోనోలిత్ ఎవరు ఏర్పాటు చేశారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది
తొలుత ఈ మోనోలిత్ అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించింది. ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్‌కు చెందిన సిబ్బంది కనుగొన్నారు
తాజాగా ముంబయిలోని బంద్రా జాగర్స్ పార్క్ మధ్యలో మళ్లీ అలాంటి మోనోలీత్ బుధవారం ప్రత్యక్షమైంది.
ఈ సందర్భంగా బంద్రా కార్పొరేటర్ ఆశిఫ్ జకారియా ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. అద్దంలా మెరిసిపోతున్న ఈ లోహపు స్తంభం మీద ఏవో నెంబర్లు చెక్కి ఉన్నాయని ఆయన తెలిపారు.
వాటికి అర్థం ఏమిటో తమకు తెలీదని, అది ఎన్ని రోజులు ఉంటుందో సందేహమేనని చెప్పారు. అయితే, ఇది కూడా అహ్మదాబాద్ ఆర్టిస్టు చేసిన మోనోలీత్ కావచ్చని, ఇందులో డౌట్ లేదని అంటున్నారు.