
డబ్బులు వీలైనంత ఎక్కువ సంపాదించాలని.. విలాసవంతంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కోట్లాది రూపాయలను సంపాదిస్తూ.. సంతోషముగా సుఖంగా జీవించాలని డబ్బుల సంపాదన కోసం కష్టపడతారు. కొందరు తమ శక్తికి మించి కనబడితే.. మరికొందరు.. తమ మేధస్సుకు పదును పెడతారు.. ఇంకొందరు తమకు వచ్చిన పనుల్లో ప్రతిభ చూపిస్తూ.. బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఓ యువతి వింత పని చేస్తూ.. లక్షలాది రూపాయలను సంపాదిస్తూ వార్తల్లో నిలిచింది. (ఫోటో: Instagram/soy_kerolaychaves)

మోడల్‌లు తమ ఫోటోలను అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడం గురించి అందరికి తెలిసిందే. అయితే ఎవరైనా తమ పాదాల ఫోటోలను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, కెరోలాయ్ చావ్స్ అనే అమ్మాయి ఇలాంటిదే చేస్తుంది. ఆమె కేవలం తన పాదాల చిత్రాన్ని అమ్మడం ద్వారా దాదాపు రూ. 16 లక్షలు సంపాదిస్తుంది. (ఫోటో: Instagram/soy_kerolaychaves)

డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. నెటిజన్లు కెరోలాయ్ చావ్స్ పాదాలను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఆమె పాదాలను చూడటానికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి సై అంటున్నారు. కేవలం ఫ్యాన్స్‌కి తన పాదాల ఫోటోలను అమ్మడం ద్వారా ఆమె లక్షలాది రూపాయలను ఏ మాత్రం కష్టపడకుండా సంపాదిస్తుంది. ఆమె కాళ్ళ అందాన్ని ఆరాధించే పిచ్చి అభిమానులున్నారు. (ఫోటో: Instagram/soy_kerolaychaves)

నివేదికల ప్రకారం కెరోలాయ్ చావ్స్ పాదాల ఫోటోలకు మాత్రమే కాదు.. ఆమె ధరించే బూట్లు, సాక్స్‌లన్నా పిచ్చే ఫ్యాన్స్ కు. అందుకనే ఆ యువతి వాడిన షూస్ కొనేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇదే విషయంపై కెరోలాయ్ చావ్స్ స్పందిస్తూ.. తన బూట్లను వాసన చూడాలనుకుంటున్నారని పేర్కొన్నాడు. (ఫోటో: Instagram/soy_kerolaychaves)

తాను ఉపయోగించిన బూట్లు, సాక్స్‌లను ఇవ్వమని చాలామంది అడుగుతారని.. అనేక మెసేజ్ లను రోజూ తాను రిసీవ్ చేసుకుంటానని కరోల్ చెప్పింది, అయితే కరోల్ వారి కోరికను తిరస్కరించినట్లు పేర్కొంది. అయినా కొంతమంది తన మాటను వినకుండా బూట్లు, సాక్స్ కావాలని పట్టుబట్టడంతో.. కారోల్ తన బూట్లను కొంతమందికి విక్రయించినట్లు తెలిపింది. అయినప్పటికీ తాను ధరించే బూట్ల నుండి వచ్చే దుర్వాసన కారణంగా తనకు అవి అమ్మడం ఇష్టం లేదని స్పష్టం చేసింది. (ఫోటో: Instagram/soy_kerolaychaves)