1 / 5
ప్రపంచంలో వజ్రాలకు కొదవలేదు. అయితే కొన్ని వజ్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించాయి. వాటిలో ఒకటి కోహినూర్ వజ్రం. ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరుగాంచింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గోల్కొండలో కనుగొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ వజ్రం భారతదేశంలో లేదు. ప్రస్తుతం ఈ వజ్రం ఇంగ్లండ్ రాణి కిరీటాన్ని అలంకరిస్తోంది. ఈ వజ్రాన్ని భారత్ ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంగ్లండ్ నుంచి మాత్రం ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది.