Cows Adopted Piglet: దయ అంటే ఇదే కదా.. అడవి పంది పిల్లను మందలో కలుపుకున్న ఆవులు.. మీ గుండెను పిండేసే స్టోరీ

|

Oct 01, 2022 | 6:07 PM

అమ్మతనంలో కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సృష్టిలోని ప్రతిజీవి తన మాతృత్వాన్ని ఆనందిస్తుంది.. పిల్లలను సంరక్షించుకోవడం కోసం అవసరం అయితే ప్రాణాలను పణంగా పెడుతోంది. ఈ విషయం అనేక సార్లు అనేక వీడియోల్లో చూస్తూనే ఉన్నాం.

1 / 5
 ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, కుక్క కు పాలు ఇవ్వడం.. కోతి తన శత్రుత్వం మరచి పిల్లిని చేరదీయడం వంటి అనేక విచిత్ర ఘటనలను చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఒక ఆవుల మంద ఒంటరైన అడవి పంది పిల్లను ఎంతో జాగ్రత్తగా చేసుకుంటున్నాయి. అవి సంరక్షిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలకు ఫిదా అవుతున్నారు. కామెంట్స్ తో పాటు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ విచిత్ర ఘటన జర్మనీ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

2 / 5
 జర్మనీలోని ఒక ఆవు మంద ఒంటరి అడవి పంది పిల్లను దత్తత తీసుకుంది. దాదాపు మూడు వారాల క్రితం సెంట్రల్ జర్మన్ కమ్యూనిటీ ఆఫ్ బ్రెవోర్డేలో ఆ అరుదైన ఘటనను గుర్తించారు. ఆవుల మంద మధ్య పంది పిల్లను గుర్తించినట్లు రైతు ఫ్రెడరిక్ స్టాపెల్ DPA  వార్తా సంస్థతో చెప్పారు. ఈ పొలం సమీపంలోని నదిని దాటుతున్న సమయంలో ఈ అడవి పంది పిల్ల తన సమూహం నుంచి విడిపోయి ఉండవచ్చు అని భావిస్తున్నారు.

3 / 5
 అడవి పందుల వల్ల  పంటలకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ విషయం తమకు తెలుసుకు కనుక ఆ పంది పిల్లను  తాను తీసుకురాలేదని స్టెపెల్ చెప్పారు. అంతేకాదు ఆ పంది పిల్లకు స్థానిక వేటగాడి నుంచి ఎటువంటి హాని కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ పంది పిల్ల 
ముద్దుపేరు ఫ్రీడా . దీనిని  శీతాకాలంలో స్టెపెల్ దానిని ఆవులతో షెడ్‌లో ఉంచి రక్షిస్తానని చెబుతున్నారు.

అడవి పందుల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ విషయం తమకు తెలుసుకు కనుక ఆ పంది పిల్లను తాను తీసుకురాలేదని స్టెపెల్ చెప్పారు. అంతేకాదు ఆ పంది పిల్లకు స్థానిక వేటగాడి నుంచి ఎటువంటి హాని కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ పంది పిల్ల ముద్దుపేరు ఫ్రీడా . దీనిని శీతాకాలంలో స్టెపెల్ దానిని ఆవులతో షెడ్‌లో ఉంచి రక్షిస్తానని చెబుతున్నారు.

4 / 5
 
"ఇప్పుడు ఒంటరిగా వదిలేయడం అన్యాయం" అని చెప్పాడు. అడవి పందితో ఉన్న ఆవుల చిత్రాలు ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు జంతు ప్రేమికులైన నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. వీటిని చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

5 / 5
 ఒక జత ఆవుల మధ్య పందిపిల్ల నడుస్తూ ఉండే చిత్రాలలో ఒకటి. మరొక చిత్రంలో, అవి కలిసి మేస్తున్నట్లు కనిపిస్తాయి. మరొక స్టిల్‌లో, పంది పిల్ల ఒక ఆవు పక్కన నిలబడి ఆహారం తీసుకుంటుంది. పంది పిల్లను స్వాగతించిన ఈ ఆవు కుటుంబం చిత్రాలు నిజంగా చాలా అందమైనవి.