
ప్రపంచంలో వింత హాబీలకు పేరుగాంచిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అయితే మీకు తెలుసా. ఓ వ్యక్తి రక్త పిశాచిగా మారాలనుకున్నాడు, దీంతో కళ్ళతో సహా శరీరం పచ్చబొట్లుతో నింపేసుకున్నాడు. ఇప్పుడు నిజ జీవితంలో దెయ్యంగా కనిపిస్తున్నాడు. విన్నవారికి వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం.

ప్రపంచంలో చాలా మంది తమ వింత హాబీలకు పేరుగాంచారు. విభిన్న అభిరుచులతో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచారు. ప్రజలు ఈ వింత హాబీల గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక హాబీకి సంబంధించిన కథ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు అతని హాబీ కారణంగా ప్రజలు అతన్ని నిజ జీవితంలో దెయ్యం అని పిలుస్తున్నారు.

దేవుడు ఇచ్చిన రూపం పూర్తిగా కనుమరుగయ్యే విధంగా తన శరీరం మొత్తాన్ని టాటూలతో నింపేసుకున్నాడు బ్రెజిల్ కు చెందిన ఫెర్నాండో ఫ్రాంకో డి ఒలివేరా. పిశాచంగా తాను కనిపించాలనుకోవడమే కాదు క్రేజ్ కోసం నాలుక, తల అన్నింటినీ మార్పులు చేసుకున్నాడు.

ఫెర్నాండో ఫ్రాంకో డి ఒలివెరా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తనకు ఇంకా సంతృప్తి లేదని.. మరింతగా మార్పులు చేయాల్సి ఉందని చెప్పారు. పిశాచిలా కనిపించడం కోసం శరీరంపై ఇంకా చాలా టాటూస్ వేయాల్సి ఉందని చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 2000 సంవత్సరం నుంచి తన శరీరంపై టాటూలు వేయించుకోవడం మొదలుపెట్టానని పేర్కొన్నారు.

ఫెర్నాండో ఫ్రాంకో డి మొదట తన కళ్లలో పిశాచంలా కనిపించేలా టాటూ వేయించుకున్నాడు. ఇది కాకుండా, అతను తన ముక్కును కత్తిరించికున్నాడు. పిశాచంలా కనిపించేలా తన దంతాలను సరిచేసుకున్నాడు.

ఫెర్నాండో ఫ్రాంకో డి ఇన్‌స్టాగ్రామ్‌ను 87 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. ఎవరైనా మొదటిసారి ఫెర్నాండో చుస్తే.. తీవ్రంగా భయపడతారు.