Viral News: ఫోటోల్లో, కొత్త గడియారాల్లో సమయం ఎప్పుడూ 10:10 చూపిస్తుంది.. దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా?

Updated on: Dec 25, 2021 | 7:44 PM

Viral News: దుకాణాల్లో డిస్‌ప్లే ఉంచే గడియారాల్లో సమయం 10 గంటల 10 నిమిషాలకు సెట్‌ చేసి ఉండడానికి మీలో చాలా మంది గమనించే ఉంటారు. ఇంతకీ అలా సెట్ చేయడానికి గల కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా.?

1 / 4
 సాధారణంగా మనం వాచ్‌ దుకాణాల్లో కొత్త గడియారాల్లో, వాచ్‌ బొమ్మలపై సమయం 10 గంటల 10 నిమిషాలు సెట్‌ చేసి ఉండడాన్ని గమనించే ఉంటారు. ఇంతకీ వాచ్‌లలో ఇదే సమయాన్ని ఎందుకు సెట్‌ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.?

2 / 4
సమయం 10:10 సెట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది.. సమయం 10:10 ఉన్నప్పుడు, గడియారంలో ముళ్లు వాచ్‌ లోగోను, బ్రాండ్‌ పేరుకు అడ్డుగా మారదు. కాబట్టి ఆ వాచ్‌ కంపెనీ ఏంటనేది స్పష్టంగా కనిపిస్తుంది.

3 / 4
ఇక రెండో కారణం విషయానికొస్తే.. చాలా చేతి వాచుల్లో 3,6, 9 నెంబర్ల వద్ద తేదీ చూపించే ఆప్షన్‌ ఉంటుంది. కాబట్టి గడియారం ముళ్లులు 10:10 వద్ద ఉన్నప్పుడు తేదీ చూపించే ఫీచర్‌కు అడ్డుగా ఉండవు. కాబట్టి వాచ్‌ను ప్రమోట్‌ చేసే సమయంలో వినియోగదారులకు వాచ్‌లోనూ తేదీ చూపించే భాగం కూడా కనిపించే వీలు ఉంటుంది.

4 / 4
ఇక సమయం 10:10గా ఉన్నప్పుడు స్మైలీ సింబల్‌లా కనిపిస్తుందని, కంపెనీలు అందుకే అలా డిజైన్‌ చేస్తాయని కొందరి అభిప్రాయం. ఇక చాలా కంపెనీలు కూడా గడియారంలోని ముళ్లులు ఇలా ఉంటేనే వాచ్‌కు అందం వస్తుందని నమ్ముతున్నాయి.