Srilakshmi C |
Dec 04, 2022 | 5:59 PM
పీరియడ్స్ సమయంలో కడుపునొప్పితో చాలా మంది ఇబ్బందిపడిపోతుంటారు. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అల్లం టీ తాగడం వల్ల కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని తాగడం వల్ల కండరాల నొప్పి కూడా తగ్గుముఖం పడతాయి.
బెల్లం - సోంపుతో తయారు చేసిన టీ వల్ల కూడా కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. బెల్లంలో కాసిన్ని సోంపు గింజలు వేసి తయారు చేసిన టీ.. కడుపు నొప్పిని తగ్గించడమేకాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అరటిపండులో బి6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచడమేకాకుండా కడపునొప్పి నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది.
ఆకుకూరల్లో థైమోల్ ఉంటుంది. పీరియడ్ సమయంలో ఆకుకూరలు తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందవచ్చు.