
కొన్ని లక్షల కోట్ల డబ్బును 25 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చారు... చివరికి కాల్చి బూడిద చేశారు. ఏంటి చదవగానే షాక్ అయ్యారా.? అయితే అసలు స్టోరీ ఏంటో తెలుసుకుంటే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.! ఈ ఘటన జర్మనీలో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

చరిత్ర.. ఎన్నో ఆశ్చర్యాలు, అరుదైన విషయాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. అటువంటి వాటిల్లో జర్మనీలోని కోచెమ్ పట్టణంలో ఉన్న బంకర్ కూడా ఒకటి. అమెరికా-సోవియట్ యూనియన్ మధ్య ‘కోల్డ్ వార్’ నడిచిన సమయంలో జర్మనీ ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున ధనాన్ని బంకర్‌లో దాచి పెట్టిందట. ఈ విషయం అక్కడి ప్రజలకుగానీ, మరెవరికీ తెలియకుండా చాలా గోప్యత పాటించారు.

15 బిలియన్లు అంటే ప్రస్తుత కరెన్సీ ప్రకారం సుమారు 1.25 లక్షల కోట్లు బంకర్‌లో దాచిపెట్టారు. అంతేకాదు మరో 11 బిలియన్ల మేర ఆల్టర్నేటివ్ కరెన్సీని కూడా ఆ బంకర్‌లో జర్మనీ సెంట్రల్ బ్యాంకు దాచిపెట్టిందట. కాగా డబ్బులు దాచి పెట్టిన బంకర్‌కు బీబీకే-2 అని కోడ్ కూడా ఇచ్చారట.

కోల్డ్ వార్ సమయంలో జర్మనీ మానిటరీ వ్యవస్థపై దాడి జరుగుతుందనే అనుమానంతో ముందు జాగ్రత్తగా ఈ బంకర్‌ను ఏర్పాటు చేసి.. పెద్ద ఎత్తున ధనాన్ని నిల్వ చేశారట. 1964 నుంచి పదేళ్ల పాటు వందలాది ట్రక్కుల్లో కరెన్సీ కట్టలను ఈ బంకర్‌లోకి చేర్చారట.

ఎవరూ అనుమానించలేని విధంగా నాడు ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించారట. 18,300 బాక్సుల్లో బ్యాంకు నోట్లను ఉంచి భద్రపరిచారట. ఇందుకోసం భూగర్భంలో 1,500 చదరపు మీటర్లు విస్తీర్ణంతో ఈ బంకర్ ఏర్పాటు చేశారట.

1989లో కోల్డ్ వార్ ముగింపునకు రావడంతో బంకర్‌లోని నోట్లను బయటకు తీసి తగలబెట్టారట. అనంతరం ఈ బంకర్ ఒక కోపరేటివ్ బ్యాంకు చేతికి వెళ్లగా.. 2016లో పెట్రా రాయిటర్, మన్ ఫ్రెడ్ దంపతుల చేతికి వెళ్లి అది మ్యూజియంగా రూపుదాల్చిందట. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతుండటంతో ఈ బంకర్ల అంశం హాట్ టాపిక్‌గా మారింది.