వరదలకు చెక్ పెట్టేందుకు విజయవాడ అధికారుల వినూత్న ప్లాన్.. కాలువల్లో పడవ ప్రయాణం!

Edited By:

Updated on: Jul 22, 2026 | 6:55 PM

విజయవాడలోని కృష్ణలంకలోని అంబేద్కర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వీఎంసీ బయాలజిస్ట్ సీహెచ్. సూర్య నాయక్ ఆధ్వర్యంలో అధికారులు బందర్ కాలువలో పడవలో ప్రయాణిస్తూ కాలువ పరిస్థితిని పరిశీలించారు. అదే సమయంలో లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్త వేయవద్దని విజ్ఞప్తి చేశారు.

1 / 5
సాధారణంగా అధికారులు రోడ్లపై ర్యాలీలు చేస్తారు.. సమావేశాలు నిర్వహిస్తారు.. పోస్టర్లు విడుదల చేస్తారు. కానీ విజయవాడ నగరపాలక సంస్థ మాత్రం ఈసారి అందుకు భిన్నంగా ఆలోచించింది. ప్రజలకు నేరుగా సందేశం చేరాలనే ఉద్దేశంతో ఏకంగా కాలువల్లో పడవ దించి, లౌడ్‌స్పీకర్ల ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఈ వినూత్న ప్రచారం స్థానికుల దృష్టిని ఆకర్షించింది

2 / 5
విజయవాడలోని కృష్ణలంకలోని అంబేద్కర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వీఎంసీ బయాలజిస్ట్ సీహెచ్. సూర్య నాయక్ ఆధ్వర్యంలో అధికారులు బందర్ కాలువలో పడవలో ప్రయాణిస్తూ కాలువ పరిస్థితిని పరిశీలించారు. అదే సమయంలో లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్త వేయవద్దని విజ్ఞప్తి చేశారు.

విజయవాడలోని కృష్ణలంకలోని అంబేద్కర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వీఎంసీ బయాలజిస్ట్ సీహెచ్. సూర్య నాయక్ ఆధ్వర్యంలో అధికారులు బందర్ కాలువలో పడవలో ప్రయాణిస్తూ కాలువ పరిస్థితిని పరిశీలించారు. అదే సమయంలో లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్త వేయవద్దని విజ్ఞప్తి చేశారు.

3 / 5

కాలువలు చెత్తతో నిండిపోవడం వల్ల వర్షపు నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోడ్లు, కాలనీలు జలమయం అవుతున్నాయి. నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా అధికమవుతోంది. అందుకే కాలువలను చెత్తకుండీలుగా కాకుండా నీటి ప్రవాహ మార్గాలుగా కాపాడాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా క్యాచ్ ది రైన్ కార్యక్రమంపై కూడా విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో, అపార్ట్‌మెంట్‌లో, వాణిజ్య సముదాయంలో, ప్రభుత్వ కార్యాలయంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకేలా చేయాలని సూచించారు.

4 / 5
ఇలా చేయడం వల్ల భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ఉంటుందని వివరించారు.
వర్షాకాలంలో నగరాన్ని వరదల నుంచి రక్షించడంలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా కాలువను మూసివేసే ప్రమాదం ఉందని, అందుకే చెత్తను కాలువల్లో కాకుండా వీఎంసీ ఏర్పాటు చేసిన చెత్త సేకరణ కేంద్రాలకు మాత్రమే అందించాలని కోరారు.

ఇలా చేయడం వల్ల భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ఉంటుందని వివరించారు. వర్షాకాలంలో నగరాన్ని వరదల నుంచి రక్షించడంలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా కాలువను మూసివేసే ప్రమాదం ఉందని, అందుకే చెత్తను కాలువల్లో కాకుండా వీఎంసీ ఏర్పాటు చేసిన చెత్త సేకరణ కేంద్రాలకు మాత్రమే అందించాలని కోరారు.

5 / 5
విజయవాడలో ప్రతి ఏడాది వర్షాకాలంలో నీటి నిల్వ, కాలువల సమస్యలు చర్చకు వస్తున్న నేపథ్యంలో పడవపై మైక్‌తో వీఎంసీ చేపట్టిన ఈ వినూత్న ప్రచారం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు చెప్పిన సందేశం ఒక్కటే.. "కాలువల్లో చెత్త కాదు.. నీరు ప్రవహించేలా కాపాడితేనే వరదలకు చెక్, నగరానికి రక్షణ.

Follow Us