- Telugu News Photo Gallery Venesa moura prepares perfume from her men say my body odor is ‘sexy and exciting’
Unique Scent: ఆ మహిళ చెమట వెరీ వెరీ స్పెషల్.. పురుషులను ఆకర్షించేందుకు పువ్వులకు బదులుగా చెమటతో పెర్ఫ్యూమ్ ..
ఎవరితోనైనా ముఖ్యమైన సమావేశమైనా, పెళ్లి అయినా లేదా పార్టీ అయినా సరే.. పెర్ఫ్యూమ్ ఉండాల్సిందే.. శరీరం నుంచి ఆహ్లదపరిచేలా వాసన వస్తూ.. పదువురిని ఆకర్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు చాలా పరిమళ ద్రవ్యాల గురించి చదివి ఉంటారు. విని ఉంటారు. అయితే ఇలాంటి పరిమళం గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు.. అంతేకాదు అసలు ఊహించి ఉండరు.. ఎందుకంటే ఇది చెమటతో తయారు చేయబదిన పెర్ఫ్యూమ్.
Updated on: Apr 10, 2023 | 12:44 PM

మనం ఎక్కడికైనా బయటకు వెళ్లాలన్నా, పెళ్లికి హాజరు కావాలన్నా పెర్ఫ్యూమ్ రాసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లం. ఎవరికైనా ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి లేదా శుభాకాంక్షలను తెలియజేయడానికి పెర్ఫ్యూమ్ గిఫ్ట్ ఇవ్వడం ఉత్తమ మార్గం. అంతేకాదు మీరు ఇష్టపడే ఆమెను సంతోషాన్ని, పాజిటివ్ ఎనర్జీని కలిగించే బహుమతులను ఇవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే మంచి పువ్వులతో తయారు చేసిన పరిమళం అందించే పెర్ఫ్యూమ్ ను గిఫ్ట్ గా ఇస్తే ఆ ఆనందం వర్ణనాతీతం..

అయితే అదే పెర్ఫ్యూమ్ పువ్వులకు బదులుగా చెమటతో తయారు చేయబడితే! వినడానికి మీకు వింతగా అనిపిస్తుంది కానీ ఇది నిజం. వాస్తవానికి, ఒక మహిళ తన చెమట సహజమైన వాసనను వెదజల్లుతుందని పేర్కొంది.. ఈ చెమట పురుషులు ఉత్తేజపరుస్తుందని.. అందుకని దీనిని సెక్సీగా భావిస్తారట.

ఆ మహిళ ఇన్‌ఫ్లుయెన్సర్ , మోడల్ వెనెస్సా మౌరా. ఆమె 2021 సంవత్సరంలో తన చెమటతో ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్‌ను సృష్టించింది. ఈ పెర్ఫ్యూమ్ సువాసన గురించి మాట్లాడుతూ.. ఏ వ్యక్తినైనా తన వైపు ఆకర్షించడానికి ఈ సువాసన సరిపోతుందని ఆమె పేర్కొంది.

అంతేకాదు తన మాజీ ప్రేమికులు తన శరీరాన్ని సెక్సీగా,యు విలాసవంతంగా వాసన చూస్తారని దీనికి కారణం తన చెమట నుంచి వచ్చే వాసన కారణం అంటూ వెనెస్సా మౌరా చెప్పింది. అందుకే తనతో ప్రేమికులు సంబంధాలు చాలా కాలం పాటు కొనసాగించారని పేర్కొంది.

వెనెస్సా ఈ పెర్ఫ్యూమ్‌ను తయారు చేయడానికి ప్రతి సీసాలో 8 ml తన చెమటను ఉంచుతుంది. చెమటతో పెర్ఫ్యూమ్ తయారీ గురించి ప్రపంచానికి బహిరంగంగా చెబుతోంది. ఇది తన అభిరుచి , రహస్యం ప్రత్యేక కలయిక అని చెబుతుంది.

మాండరిన్ ఆరెంజ్, బెర్గామోట్, పింక్ పెప్పర్ , ఫ్రూటీ నోట్స్‌తో పాటు, తన స్వేట్ పెర్ఫ్యూమ్‌కు ప్రత్యేక స్పర్శ ఉందని పేర్కొంది. ఈ పెర్ఫ్యూమ్ ఏ అబ్బాయి, అమ్మాయికైనా ఆదర్శవంతమైన మిక్స్ అని వెనెస్సా చెప్పింది.

ఈ పెర్ఫ్యూమ్ కు 'ఫ్రెష్ గాడెస్' అని పేరు పెట్టింది. అంతేకాదు తన పెర్ఫ్యూమ్ ఉపయోగించిన వ్యక్తి ఆఫీసుకు వెళ్లగా.. అతని సహోద్యోగి ఒకరు తననుంచి వస్తున్న వాసన చూసి ప్రేమలోపడిందని తనతో చెప్పాడని ఒక వీడియోలో వెల్లడించింది వెనెస్సా. వెనెస్సా చెమట సెంటుతో ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిందని. సోషల్ మీడియాలో ఆమెను 10 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు
