
వెజిటేబుల్ మజ్జిగ పులుసు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో తింటారు. ఇంకా ఈ సమ్మర్లో బాడీకి ఎంతో చలువ చేస్తుంది. టేస్టీ వంటకం అని కూడా చెప్పొచ్చు. అయితే, దీనిలో కొద్దిగా పెరుగు లేదా మజ్జిగను పోస్తే సరిపోతోంది. అలాగే, త్వరగా జీర్ణమవుతుంది కూడా. వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది.

వెజిటేబుల్ మజ్జిగ పులుసు కావాల్సిన పదార్దాలు: పెరుగు, ఆయిల్, ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, చిన్న ఉల్లిపాయ ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి చివర్లో మజ్జిగ కూడా పోసి, కొద్దిగా ఉప్పును కూడా వేయాలి.

ముందుగా మజ్జిగను ప్రిపేర్ చేసుకోవాలి : ఒక చిన్న గిన్నెలో కప్పు పెరుగు వేసి దానిలో కొద్దిగా రెండు గ్లాసులు నీళ్లు పోసి, ఉండలు లేకుండా మజ్జిగలాగా దానిని కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని ఆయిల్ వేసి, అది వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు వేసుకోవాలి.

ఇది బాగా వేగిన తర్వాత, దానిలో కొద్దిగా పసుపు, కారం వేసి దానిలో మజ్జిగ కూడా పోయాలి. ఈ మజ్జిగను తీసుకుని ఉల్లిపాయ ముక్కలున్న దానిలో పోసి 15 పది నిముషాలు పాటు బాగా ఉడికించాలి. ఉల్లిపాయ, కూరగాయ ముక్కలకు మజ్జిగ రసం పట్టించాలి.

ఇక చివర్లో మళ్ళీ ఇంకో పాంజ్ తీసుకుని కొద్దిగా ఇంగువ, ఒక టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 5 ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించి ఈ ఉల్లిపాయ మజ్జిగలో వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే బాడీలో ఉన్న హీట్ మొత్తం పోతోంది.