
జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతనే వేరు. ఇక వాస్తు అంటే ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. తప్పనిసరిగా వాటన్నిటినీ పాటించాలని చెబుతుంటారు. ముఖ్యంగా రావి చెట్టు విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. దాని గురించి పూర్తిగా, వివరంగా తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరూ రావి చెట్టును పూజిస్తుంటారు. అయితే రావి చెట్టును పూజించడం వలన కొన్ని దోషాలు తొలిగిపోతాయని చెబుతుంటారు. ఇక కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టు ఇంటి గోడలపై పెరగడం అస్సలే మంచిది కాదు. కాగా, ఇప్పుడు దీని గురించే వివరంగా తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గోడలపై అలాగే ఇంటి పై కప్పులపై రావి చెట్లు పెరిగితే అది చాలా అశుభకరం. ఇది ఇంటిలో సంపదకు ఆటంకం కలిగించడమే కాకుండా, ఇంటిలోపల ప్రతి కూల శక్తిని కూడా పెంచుతాయంట. అంతే కాకుండా ఇది దురదృష్టానికి కూడా కారణం అవుతుంది. అందు వలన ఇలాంటి ఇంటిలో ఉండటం, అద్దెకు ఉండటం కూడా చాలా అశుభకరం అంటున్నారు పండితులు.

ఇంటిపై 48 కంటే ఎక్కువ రావి చెట్లు గనుక పెరిగినట్లు అయితే అది పెద్ద వాస్తు దోషంగా పరిగణించబడుతుందంట. దీని వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఒత్తిడి , ఆకస్మిక అడ్డంకులు ఏర్పడే ఛాన్స్ ఉన్నదంట. అందువలన రావి చెట్లు ఎవరి ఇంటి వద్ద అయితే పెరుగుతుందో అక్కడ నివాసం ఉండటం చాలా సమస్యలకు కారణం అవుతుందంట.

ఇక ఒక వేళ మీరు అదే ఇంటిలో నివాసం ఉండాలి అనుకున్నప్పుడు,ఎవరి ఇంటి పై కప్పు లేదా గోడల పై రావి చెట్టు పెరుగుతుందో వారు పూజారి చేత పూజలు చేయిచి, ఆ ఇంటిలో నివాసం ఉండాలంట. దీని వలన వాస్తు ప్రభావం ఆ ఇంటి వారిపై ఉండదని చెబుతున్నారు వాస్తు నిపుణులు.