
అయితే గులాబీ మొక్కలు ఇంట్లో పెట్టుకోవడం మంచిదే అయినప్పటికీ దీనిపై వాస్తు ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. గులాబీ మొక్కను ఇంట్లో సరైన దిశలో నాటకపోతే కుటుంబంలో సమస్యలు వస్తాయంట. కాగా, అసలు ఇంట్లో ఏ దిశలో గులాబీ మొక్క నాటితే మంచిదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

వాస్తు శాస్త్ర ప్రకారం గులాబీని ప్రేమకు చిన్నహంగా అభివర్ణిస్తారు. అంతే కాకుండా వీటిని ఇంట్లో పెట్టుకోవడం వలన ఆనందం, శ్రేయస్సు కలుగుతుందంట. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గులాబీ మొక్క నాటడం కూడా చాలా శుభ ప్రదం. ఇంది ఇంటిలోపలికి పాజిటివివ్ ఎనర్జీ తీసుకొచ్చి, నెగిటివిటిని తరిమి కొడుతుందంట.

అంతే కాకుండా లక్ష్మీ దేవికి ఇష్టమైన మొక్కల్లో గులాబీ మొక్క కూడా ఒకటి. కాబట్టి ఈ మొక్కను ఇంటి ఆవరణంలో నాటుకోవడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు పండితులు. కానీ చాలా మందికి వాస్తు ప్రకారం గులాబీ మొక్కను ఏ దిశలో నాటలో సరిగ్గా తెలియదు. కాగా, వాస్తు నిపుణల ప్రకారం గులాబీ మొక్కను ఇంటి బయట ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటడం చాలా మంచిదంట.

ఈ దిశలో గులాబీ మొక్కను నాటడం వలన సంపద పెరగడమే కాకుండా ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుదంటున్నారు వాస్తు శాస్త్రనిపుణులు. అలాగే, ఇంటి ప్రధాన ద్వారం వద్ద గనుక గులాబీ మొక్క నాటినట్లైతే, ఇది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుందంట. అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుందంట. అయితే కొంత మంది గులాబీ మొక్కను ఇంటి లోపలో పెట్టుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

అయితే కొంత మంది గులాబీల్లో ఏ రంగు గులాబీ ఇంట్లో పెట్టుకోవడం మంచిది అనే అనుమానం ఉంటుంది. అయితే లక్ష్మీ దేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా ఆ దేవికి ఎరుపు రంగు గులాబీలంటే ఎనలేని ప్రీతి ఉంటుందంట. అందుకే ఇంట్లో ఎరుపు రంగు గులాబీలను నాటుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.