Vastu Tips: అప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ నివారణ చర్యలు పాటించి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..

Updated on: Oct 01, 2023 | 8:06 AM

సనాతన హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సంపదకు దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయని నమ్మకం. అంతేకాదు కుబేరుడు, శుక్రుడు కూడా ఎవరిపై అనుగ్రహం కలిగి ఉంటారో వారికీ ఎప్పడూ ఆర్ధిక ఇబ్బందులు కలగవని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే ధన ధాన్యాలకు ఇబ్బంది కలగదని విశ్వాసం. ప్రత్యేక పరిస్థితుల్లో క్రమం తప్పకుండా చేసే దానాలతో డబ్బుకు లోటు ఉండదు. డబ్బు సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి వాస్తు ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.. 

1 / 5
రుణ సమస్యల నుండి విముక్తి - అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటే శుక్రవారం వేప చెట్టుని పూజించండి. శక్తి మేరకు ఆకలి అన్నవారికి అన్న వితరణ చేయండి.    

2 / 5
సంపద కోసం - శుక్రవారం రోజున లక్ష్మి దేవికి గులాబీ పూల దండలు సమర్పించండి. ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీ హారతి సమర్పించాలి. ఈ రోజున స్త్రీలకు తెల్లని స్వీట్లను దానం చేయండి. వాస్తు నమ్మకం ప్రకారం ఈ నివారణ చర్యలతో పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉందని విశ్వాసం. 

3 / 5
ఆదాయ మార్గాలు పెంచుకునే విధానం: రోజూ రావి చెట్టుకు పూజ చేయండి. నీరు సమర్పించి.. మిఠాయిని నైవేద్యంగా సమర్పించండి.  అనంతరం రావి చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయండి. అనంతరం  ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రార్థించండి.  ఇలా చేయడం వల్ల ఉద్యోగం, డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోయి ఆదయ మార్గాలు లభిస్తాయని విశ్వాసం. 

4 / 5
వ్యాపారంలో సంపద - గులాబీ పువ్వుపై లక్ష్మిదేవి చిత్రాన్ని ఉంచండి. అనంతరం రోజ్ వాటర్ తో అభిషేకం చేయండి.  ఈ పరిహారం వ్యాపార సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. వ్యాపార అభివృద్ధికి బాటలు వేస్తుంది.  

5 / 5
అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి పొందడం ఎలా - పేదలకు మిఠాయిలు, బట్టలు పంపిణీ చేయండి. రోజూ  నీటిలో పాలు, నీరు కలిపి చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. ఆ తర్వాత తమ డబ్బుల కోసం, ఆర్ధిక ఇబ్బందులు తీరాలని ప్రార్థించండి.