
బంగారం లక్ష్మీదేవికి చిహ్నం. ఇక బంగారం ఇంటిలో ఉండటం వలన అన్ని విధాల కలిసి వస్తుంది. అయితే కొంత మంది ఇంటిలోపల ఎక్కువ మొత్తంలో బంగారం ఉంటుంది. కానీ కొంత మంది వద్ద ఏం చేసినా బంగారం ఉండదు. ఒక వేళ గోల్డ్ కొనుగోలు చేసినా వారు తాకట్టు పెట్టుకునే ఉంటారు. అయితే ఇలా జరగడానికి ముఖ్య కారణం వాస్తు అంటున్నారు పండితులు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంట్లోనైతే ఆడవారిని గౌరవించబడరో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదంట. అలాగే ఆ ఇంట్లో బంగారం, డబ్బు నిలవదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంటిలోనైతే ఎక్కువగా, చెత్త ధూళి, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుందో వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు, బంగారం ఎక్కువ కాలం నిలవదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే ఎప్పుడూ కూడా ఇళ్లు దుమ్ము, ధూళి లేకుండా ఉండాలంట. అంతే కాకుండా ఎప్పుడూ కూడా బీరువాను లేదా బంగారాన్ని దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో పెట్టకూడదంట. ఇలా పెట్టడం వలన ఆస్తి ఎప్పుడూ స్థిరంగా ఉండదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అలాగే కొంత మంది అనేక ఆర్థిక సమస్యల కారణంగా బంగారం కొనుగోలు చేసిన వెంటనే తనఖా పెడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలే మంచిది కాదంట. దీని వలన లక్ష్మీదేవి వారి ఇంట ఉండటానికి ఇష్టపడదంట. దీని వలన ఆర్థిక సమస్యలు వస్తాయంట.
