
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఒక కప్పు బియ్యం, 4 కప్పుల ఫ్రెష్ మిల్క్, పావు కిలో తురిమిన బెల్లం, ఒక టీ స్పూన్ ఏలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పులు , కిస్ మిస్ లు, రుచికి సరిపడా తీసుకోవాలి.

ముందుగా రెండు కొబ్బరికాయలను తీసుకుని బ్రేక్ చేసి దాని నుంచి పచ్చి కొబ్బరిని వేరు చేసి తురిమి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత బియ్యాన్ని తీసుకుని కడిగి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని తీసుకుని సన్నగా తురిమి ఇంకో ప్లేట్ లోకి తీసుకోవాలి.

స్టవ్ వెలిగించి ఒక పెద్ద పాత్ర పెట్టి నాలుగు కప్పుల పాలు పోసి బాగా మరిగిన తర్వాత తురిమిన బెల్లం, ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ మీదే ఉంచి గరిటే తో మిక్స్ చేస్తూ తిప్పుతూ ఉండాలి.

పాలు మరిగిన తర్వాత, ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, తురిమిన పచ్చి కొబ్బరి వేసి, సన్నని మంట మీద ఉంచి కలుపుతూ 15 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. పచ్చి కొబ్బరి మెత్తగా అయ్యే వరకు పొయ్యి మీదే అలాగే ఉంచండి.

రెండో సారి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి అది కాగిన తర్వాత బాదం పప్పులు, 2 టేబుల్ స్పూన్స్ కిస్‌మిస్‌లను కూడా రంగు మారే వరకు బాగా వేయించి ఈ మిశ్రమాన్ని పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి పాయసం రెడీ.